అన్వేషించండి

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

బీర్లను మీ కడుపులో బిరబిరా పారిస్తున్నారా? అయితే, మీరు ఏ బ్రాండ్ బీరు తాగుతున్నారో చెక్ చేసుకోండి. ఎందుకంటే, ఆ సంస్థలోని బీర్లను మూత్రం, మురుగు నీటితో తయారు చేస్తున్నారట.

మీరు బీరు ప్రియులా? మీరు రోజు తాగుతున్న బీరు‌ను మూత్రంతో తయారు చేశారని తెలిస్తే మీరు ఏం చేస్తారు? వెంటనే వాంతి చేసుకుంటారు లేదా బిక్క ముఖం వేసి.. బ్రాండ్ మార్చేస్తారు. తెలిసి తెలిసి మూత్రంతో తయారు చేసే బీరును మీరు తాగేందుకు ఏ మాత్రం సాహసం చేయరు. అయితే, ఓ సంస్థ మాత్రం తమ బీరును మూత్రంతో తయారు చేశామని, వచ్చి టేస్ట్ చేయండని సగర్వంగా చెబుతోంది. ప్రజలు కూడా దాన్ని రుచి చూసేందుకు క్యూ కడుతున్నారు. కంగారు పడకండి. మీరు ఈ బ్రాండ్ బీరును ఎప్పుడూ తాగి ఉండరు. ఎందుకంటే దీన్ని సింగపూర్‌లో తయారు చేస్తు్న్నారు. ఒక వేళ మీరు సింగపూర్‌లో ఉండి ఉంటే మాత్రం ఆ బ్రాండ్ గురించి తెలుసుకోండి. కొత్తగా ఏమైనా ట్రై చేయాలని ఆశగా ఉంటే.. భయపడకండి, ఆ మూత్రం బీరు ట్రై చేయండి. 

మూత్రంతోనే ఎందుకు?: సింగపూర్‌లో నీటి కొరత తీవ్రంగా ఉందట. ప్రజల అవసరానికి తగిన నీరు సప్లై చేయడానికే అక్కడి ప్రభుత్వం ముప్పు తిప్పలు పడుతోందట. అలాంటిది ఇక నీటిపై ఆధారపడిన బ్రూవరీ సంస్థలకు వాటర్ సప్లై చేయాలంటే కష్టంగా మారింది. నీటిని సేవ్ చేయాలని ప్రజలకు, సంస్థలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సంస్థ స్వయంగా నీటిని తయారు చేసుకుని బీర్లు తయారు చేస్తోంది. కానీ, స్వచ్ఛమైన నీటిని ఎలా తయారు చేసుకోగలుగుతుంది? అనేగా మీ సందేహం? ఎక్కడి నుంచో కాదు మూత్రం, మురుగు నీటి నుంచి. 

మూత్రాన్ని శుద్ధి చేసి..: మూత్రం, మురుగు నీటిని శుద్ధి చేయగా వచ్చే నీటితో బీరును తయారు చేయడమే కాకుండా.. మేం వాటర్‌ను సేవ్ చేస్తున్నామని సగర్వంగా NEWBrew (న్యూబ్రూ) అనే సంస్థ ప్రకటించింది. బీరు తయారీకి చాలా నీరు అవసరం అవుతుంది. బీరులో సుమారు 90 శాతం నీరే ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో నీటి కొరత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యూబ్రూ సంస్థ ఈ బీరు తయారీని ఆరంభించింది.

Also Read: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

NEWater నీటి నుంచి NEWBrew బీరు వరకు..: బీరు తయారీ కోసం నీటిని తయారీ చేయడం కోసం ఆ సంస్థ NEWater ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ కార్యాలయాలు, పాఠశాలలు, మాల్స్, మార్కెట్ టాయిలెట్ల నుంచి సేకరించిన మూత్రాన్ని ఇక్కడ అనేక దశల్లో ఫిల్టర్ చేస్తారు. మరోవైపు మురుగు నీటిని కూడా ఇదే విధంగా శుద్ధి చేసి.. నీటిని గ్రహిస్తారు. ఆ నీటిలో మాల్ట్, ఈస్ట్, హాప్స్ వంటి సూక్ష్మక్రిములేవీ ఉండవు. ఈ బీరు భలే రుచిగా ఉందంటూ మందుబాబులు తెగ తాగేస్తున్నారట. కావాలంటే, మీ సింగపూర్‌లోని స్నేహితులకు చెప్పి ఒక టిన్ తెప్పించుకోండి.  

Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది! 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PUB, the National Water Agency (@pubsingapore)

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget