By: ABP Desam | Published : 26 Oct 2021 01:21 PM (IST)|Updated : 26 Oct 2021 01:40 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Photo by Cleyder Duque from Pexels
పెళ్లంటే నూరెళ్ల పంట అంటారు. కానీ, అక్కడికి పెళ్లి కొడుకులకు మాత్రం పెద్ద తంట. పెళ్లి మాట వింటే చాలు అక్కడి అబ్బాయిలు వణికిపోతారు. అయితే, అక్కడి పెద్దలు మాత్రం.. పెళ్లి రోజు ఒక్కసారి ఆ మంటను తట్టుకుంటే.. జీవితమంతా పండగేనని చెబుతూ ఎట్టకేలకు వారిని ఒప్పిస్తున్నారు. ఇంతకీ ఆ రోజు వరుడిని ఏం చేస్తారనేగా మీ సందేహం? అబ్బే ఏం చేయరు. జస్ట్ కర్ర పట్టుకున్ని చితక్కొడతారంతే.
వామ్మో.. ఇదేం కల్చరండి బాబు, మా ఇంటా వంట లేదని అంటారా? కానీ, అక్కడ ప్రతి ఇంటా ఇదే ఆచారం. దక్షిణ కొరియాలో పెళ్లి తర్వాత వరుడు.. తన భార్యను ఇంటికి తీసుకెళ్లాలంటే.. దెబ్బలు తినాలి. ఈ సందర్భంగా వధువు కుటుంబికులు వరుడి పాదరక్షణలు తీసేసి.. అతడి అరికాళ్లను కర్రతో కొడతారు. వరుడు బాధతో విలవిల్లాడేవరకు కొడుతూనే ఉంటారు. కొంతమంది వరుడి కాళ్లను తాళ్లతో కట్టేసి మరీ కొడతారు. కొందరు వరుడిని కొట్టడానికి కర్రలను వాడితే మరికొందరు ఎండి చేపలను వాడతారు. వారి దెబ్బలకు వరుడు బాధతో కేకలు పెడుతుంటే.. అక్కడికి వచ్చిన బంధువులు, అతిథులకు మాత్రం ఇదొక వినోద కార్యక్రమమట. వరుడిని కేవలం కొట్టడమే కాదు.. రకరకాల ప్రశ్నలతో గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తారట. అయితే, ఇదంతా పెళ్లి కొడుకు బలం, అతడి క్యారెక్టర్‌ను తెలుసుకోడానికేనట. ఇదేం శాడిజమండి బాబు.
సరే, దక్షిణ కొరియాలో వరుడినైతే కొడతారు. కానీ, కెన్యాలోని మాసాయిలో జరిగే వివాహ వేడుకల్లో.. వధువు తల, రొమ్ములపై ఉమ్మివేస్తారట. స్వయంగా వధువు తండ్రే ఇలా చేస్తాడట. ఇతరులపై ఉమ్మి వేయడాన్ని మనం అగౌరవంగా భావిస్తాం. చివరికి మన కన్న తల్లిదండ్రులు ఆ పనిచేసినా.. చాలా అవమానకరంగా ఉంటుంది. కానీ, అక్కడ మాత్రం అదే ఆచారం. పెళ్లి తర్వాత వధువు.. తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లే ముందు తండ్రి ఇలా చేస్తాడు. ఆమె తల, రొమ్ములపై ఉమ్ముతాడు. మాసాయి సంస్కృతిలో వధువుపై ఉమ్మివేయడాన్ని అదృష్టం, గౌరవంగా పరిగణిస్తారు. కేవలం పెళ్లిలో మాత్రమే కాదు.. మాసాయి గిరిజనులు పెద్దలతో కరచాలనం చేసే ముందు వారి చేతులపై గౌరవ సూచకంగా ఉమ్మేస్తారు. అంతేకాదు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువులపై కూడా ఉమ్మివేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల దురదృష్టం దూరమై అదృష్టం వరిస్తుందట.
Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?
Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!