అన్వేషించండి

Top Places to Visit in AP : ఆంధ్రప్రదేశ్​లోని ఈ ప్రాంతాలకు ఎప్పుడైనా వెళ్లారా? ఈసారి ట్రిప్​కి ప్లాన్ చేసేసుకోండిలా

Best Places in Andhra Pradesh : కరెక్ట్​గా ప్లాన్ చేసుకోవాలే కానీ.. ట్రిప్స్​ కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లాల్సిన పని లేదు. ఏపీలో ఉండే కొన్ని ప్రదేశాలు మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. 

Must Visit Places in Andhra Pradesh : ట్రిప్​కి వెళ్లాలని అందరికీ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలీక.. లేదా ఎవరితో వెళ్లాలో తెలీక కొందరు ఆగిపోతుంటారు. మరికొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటారు. కానీ అక్కడ తమకి భాషతో, ఫుడ్​తో ప్రాబ్లమ్ వస్తుందని ఆగిపోతూ ఉంటారు. లేదంటే అన్ని సెట్ అయ్యేవరకు ఆగుదామని.. పోస్ట్​పోన్ చేసుకుంటూ వస్తారు. కానీ మీరు ట్రిప్​కి వెళ్లాలనుకుంటే ఏపీలోని కొన్ని ప్రదేశాలు చుట్టేయొచ్చు. 

ఇయర్ ఎండింగ్ 2024లోపు లేదా.. కొత్త సంవత్సరం 2025లో మీరు ఏపీలోని కొన్ని ప్రదేశాలను విజిట్ చేసి.. వాటి అందాలను ఆస్వాదించవచ్చు. దూరం ఉండే వాటికి వెళ్లట్లేదనే బాధతో దగ్గర్లో ఉండే ప్రకృతి అందాలను మిస్​ అయ్యేవారికి ఇది మంచి మూవ్ అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్​లో విజిట్ చేయగలిగే ప్రాంతాలు ఏంటో.. అక్కడ ఏమేమి ఎక్స్​పీరియన్స్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

అరకు (Araku Valley)

విశాఖపట్నంలోని అరకు మీకు మంచి సీనిక్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. సహజమైన అందాలతో.. గొప్ప సాంస్కృతికతతో, కాఫీ సువాసనలతో మిమ్మల్ని ఇది ఆహ్వానిస్తూ ఉంటుంది. అక్కడ మీరు కాఫీ ప్లాంటేషన్స్, బొర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్, ట్రైబల్ మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్​ని చూడొచ్చు. 

ట్రెక్కింగ్, హైకింగ్ ఇష్టపడేవారికి ఇది మంచి స్పాట్ అవుతుంది. కాఫీ ఇష్టపడేవారు ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ ఆస్వాదించవచ్చు. ఫోటోలు దిగడానికి మంచి లోకేషన్లు ఉంటాయి. మానసికంగా ప్రశాంతతను కోరుకునేవారు అరకు వెళ్లి.. హాయిగా ఎంజాయ్ చేవచ్చు. అరకును సెప్టెంబర్​ నుంచి ఫిబ్రవరిలోపు వెళ్తే మంచి ఎక్స్​పీరియ్స్ మీ సొంతమవుతుంది. 

వైజాగ్(Vizag)

విశాఖపట్నం(The City of Destiny). ఆంధ్రప్రదేశ్​లోని తీరప్రాంత నగరం.. తూర్పు కనుమలు, బంగాళాఖాతంలో కూడిన ప్రధాన ఓడరేవు దీని సొంతం. ఇక్కడ మీరు బీచ్​లు, సింహాచలం టెంపుల్, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్, కైలాసగిరి మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి.   

వైజాగ్​లో మీరు వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, షాపింగ్, టేస్టీ ఫుడ్​ని ఎంజాయ్ చేయవచ్చు. అక్టోబర్​ నుంచి ఫిబ్రవరి మధ్యలో వైజాగ్​ని విజిట్ చేస్తే వెదర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. 

పాపికొండలు (Papikondalu)

పాపికొండలు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న సుందరమైన హిల్​ స్టేషన్. ప్రకృతి సౌందర్యం, సాంస్కృతి, అడ్వెంచర్స్​ని ఇష్టపడేవారు అక్కడికి ట్రిప్​కి వెళ్లొచ్చు. పాపికొండలు హిల్స్, బోట్​లో వెళ్తూ గోదావరి అందాలు, పోచమ్మ టెంపుల్, దగ్గర్లోని రాజమండ్రిని మీరు విజిట్ చేయవచ్చు. బోట్ రైడ్​ మీకు గోదావరి సినిమా వైబ్స్ ఇస్తుంది. ట్రెక్కింగ్ చేయవచ్చు. వైల్డ్ లైఫ్​, క్యాంపింగ్, అడ్వెంచర్స్ చేయాలనుకునేవారు ఇక్కడికి వెళ్లొచ్చు. సెప్టెంబర్​ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే మంచి ఎక్స్​పీరియన్స్ ఉంటుంది. 

మారేడిమిల్లి(Maredumilli)

ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి మారేడుమిల్లి బెస్ట్ ఆప్షన్. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ గ్రామం అందమైన పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు. మారేడుమిల్లి ఫారెస్ట్, వాల్మీకి టెంపుల్,  స్వర్ణధార, జలపాతంను చూడొచ్చు. ట్రెక్కింగ్, బోట్ రైడ్స్, వైల్డ్ లైఫ్, క్యాంపింగ్, క్లైంబింగ్ వంటి అడ్వెంచర్స్ చేయవచ్చు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడికి వెళ్తే వెదర్ బాగుంటుంది. 

ఈసారి మీ ట్రిప్​ని ఏపీలోని ఈ ప్రదేశాలకు షిఫ్ట్ చేయండి. తక్కువ ఖర్చులో ఈజీగా వెళ్లగలిగే ఈ ప్రాంతాలు మిమ్మల్ని అస్సలు డిస్సాపాయింట్ చేయవు. 

Also Read : హైదరాబాద్ టూ గోకర్ణ, దండేలి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. మూడురోజులకు ఎంత ఖర్చువతుందంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Embed widget