అన్వేషించండి

Toothpaste History: టూత్‌పేస్ట్‌ లేనప్పుడు దంతాలను ఎలా శుభ్రం చేసుకునేవారో తెలుసా?

Toothpaste History: ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటారు చాలా మంది. పళ్లు తోమిన తర్వాతే రోజు ప్రారంభం అవుతుంది. ఆ టూత్‌ పేస్ట్‌కు ముందు పళ్లు ఎలా తోముకునే వారో తెలుసా?

Toothpaste History: ఉదయం లేవగానే పళ్లు తోముకుంటారు చాలా మంది. బ్రష్ చేసుకోవడంతోే రోజు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత లేదా ముందు కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి రోజు ప్రారంభిస్తారు. ఈ టూత్ బ్రష్, టూత్ పేస్ట్ లేనప్పుడు అసలు ప్రజలు ఎలా తమ పళ్లను శుభ్రం చేసుకునే వారో ఎప్పుడైనా ఆలోచించారా? వందల సంవత్సరాల క్రితం కూడా, ప్రజలు పరిశుభ్రతకు, వ్యక్తిగత శుభ్రతగా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే వారు. పళ్ల నుంచి శరీరం, తలపై జుట్టు అన్నింటినీ శుభ్రం చేసుకునే వారు. అయితే ఆ కాలంలో టూత్ బ్రష్ లు లేవు, టూత్‌పేస్ట్‌లు లేవు. మరి ఎలా పళ్లను శుభ్రం చేసుకునే వారో ఎప్పుడైనా ఆలోచించారా?

చాలా ఏళ్ల క్రితం నుంచి పళ్లు శుభ్రపరచుకోవడం

2500 సంవత్సరాల నాటి జీవనశైలిలో కూడా దంతాలు శుభ్ర పరచుకోవడం అనేది ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చాలా రకాల ఆధారాలు, పరికరాలు పురాతత్వ శాస్త్రవేత్తలకు లభించాయి. ప్రస్తుతం మనం వాడే టూత్ పేస్ట్ ను కూడా కేవలం కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే కనిపెట్టారని అనుకుంటే కూడా పొరబడినట్లే. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం నుంచి పళ్లు తోముకోవడానికి టూత్ పేస్ట్ ను వాడే వారు. డెంటిప్రైస్ పౌడర్ అని పిలిచే డ్రై టూత్ పేస్ట్ తో పళ్లు తోముకోవాలని ప్రఖ్యాత గ్రీకు వైద్యుడు హిప్పోక్రేట్స్ ప్రజలకు సూచించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 

పళ్లు శుభ్రం చేసుకోవాడనికి ఉప్పు, బొగ్గు

చెట్టు బెరడు, చిన్న చిన్న పుల్లలు, వేప పుల్లలు, ఆకులు, చేపల ఎముకలు సహా మొదలైన వాటితో పాత కాలంలో పళ్లు తోముకునే వారు. ఇందుకు సంబంధించి చాలా పద్ధతులు అప్పట్లో ఆచరణలో ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్లు ఉప్పు లేదా మసిలో ముంచిన రాగ్స్ తో పళ్లు శుభ్రం చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. కేవలం యూరోప్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, ప్రాంతాల్లో ఉప్పును పళ్లు తోముకోవడానికి ఎక్కువగా ఉపయోగించే వారు. ఇప్పటికీ పళ్లు తోముకోవడానికి ఉప్పు వాడే వారు ఉన్నారు. ఉప్పు, నిమ్మ రసం వేసుకుని పళ్లు తోముకోవడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాగే కొందరు ఇప్పటికీ బొగ్గుతో పళ్లు శుభ్రం చేసుకుంటారు. 

1700 కాలంలోనే బ్రష్ 

టూత్ బ్రష్ లను ఈ మధ్యే కనుగొన్నారని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. టూత్ బ్రష్ ల వాడకం దాదాపు 300 ఏళ్ల క్రితం నుంచే ఉన్నట్లు చరిత్ర వివరిస్తోంది. 1700 కాలంలో మొదటగా పళ్లు శుభ్రం చేసుకోవడానికి బ్రష్ లాంటి వస్తువులు వాడే వారు. ఆంగ్లేయుడు విలియం అడిస్ మొదట బ్రష్ కనిపెట్టారని, అలా టూత్ బ్రష్ ల వాడకం పెరిగిందని అంటారు శాస్త్రవేత్తలు. ఇందుకు చాలా ఆధారాలు కూడా లభించినట్లు చారిత్రక నివేదికలు పేర్కొంటున్నాయి. జైలులో ఉన్నప్పుడు, ఎముక, జంతువుల వెంట్రుకలతో టూత్ బ్రషన్ ను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందట. ఆ తర్వాత టూత్ బ్రష్ కోసం టూత్ పేస్ట్ తయారు చేయాల్సి వచ్చింది. సహజంగా దొరికే వివిధ వస్తువులను కలపడం ద్వారా పళ్లు తోముకునే పౌడర్ తయారు చేశారు. 1800 సంవత్సరం వచ్చే నాటికి టూత్ బ్రష్ ల వాడకం పెరిగింది. చాలా మంది పళ్లు తోముకోవడానికి బ్రష్ లు వాడే వారు. 

టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు భారత్ కు రావడానికి చాలా కాలమే పట్టి ఉండొచ్చు. కానీ టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు 1900కు ముందు కూడా చాలా మంది వాడారు. ఆయా దేశాల్లో వాటి వాడకం సర్వ సాధారణంగా మారింది కూడా. భారత్ లోకి టూత్‌బ్రష్ లు, టూత్‌ పేస్ట్‌లు రావడానికి చాలా ఆలస్యమైంది. ఇప్పుడంటే ఉదయం లేవగానే టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు వాడుతున్నాం.. కానీ, అంతకుముందు వేప పుల్లలతో, ఉప్పు, బూడిద, బొగ్గు మొదలైన వాటితో పళ్లు శుభ్రం చేసుకునే వారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Virat Kohli : విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
Embed widget