అన్వేషించండి

Belly Fat : ఈ చిట్కాలు పాటిస్తే పొట్టలో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది

Belly Fat : చెడు జీవనశైలి, కొవ్వు పదార్థాలు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటారు. మీరు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించాలనుకుంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

Potta taggadaniki tips in telugu : సన్నగా, నాజుగ్గా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో చిన్నా, పెద్దా లేకుండా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చెడు జీవన శైలి కారణంగా పొట్టలో కొవ్వు పేరుకుపోయి.. లావుగా మారుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శీతల పానీయాలు తీసుకోవడం ఇవ్వన్నీ కూడా బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతున్నాయి. కొవ్వును పెంచుకోవడం సులభమే కానీ.. తగ్గించుకోవడం అంత ఈజీకాదు. గంటల తరబడి జిమ్ లో వ్యాయామం చేసినా ఫలితం లేదని ఎంతో మంది ఫీల్ అవుతుంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అవుతే కొవ్వు తగ్గుతుంది.  

ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం:

బరువు తగ్గాలంటే ఆహారం తక్కువగా తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండాలి. ఈ పీజు నీటిని పీల్చుకుని జెల్ గా మారి పొట్ట చాలా కాలం నిండుగా ఉండేలా చేస్తుంది. పండ్లు, కూరగాయలు, పప్పులు, ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకునేలా ప్లాన్ చేసుకోండి. 

ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరం:

జంక్ ఫుడ్ నిండా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం.. ఇది కొవ్వులలో అత్యంత ప్రమాదకరమైన రకం. ఇది గుండె జబ్బులు, ఇన్సులిన్ నిరోధక, బొడ్డు కొవ్వును పెంచుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. 

ప్రొటీన్ ఆహారం తీసుకోవడం:

బరువు తగ్గడానికి ప్రోటీన్ తినడం చాలా ముఖ్యం. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.కడుపు నిండుగా ఉంచుతుంది.అయితే బరువు తగ్గే సమయంలో కండరాలు తగ్గవు .బొడ్డు కొవ్వును కరిగించుకునేందుకు మీరు  ఆహారంలో గుడ్లు, చేపలు, చికెన్, బీన్స్, పాల ఉత్పత్తులు వంటి వాటిని చేర్చుకోండి. 

స్వీట్లకు దూరంగా:

చాలా మందికి స్వీట్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజూ స్వీట్లు తింటుంటారు. స్వీట్లలో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును పేరుకుపోయేలా చేస్తాయి. కాబట్టి బరువును తగ్గించుకోవాలనుకునేవారు స్వీట్లను మితంగా తినడం మంచిది. 

ఒత్తిడి:

మనం తీసుకునే ఆహారమే కాదు ఒత్తిడికి కూడా బరువు పెరిగేందుకు కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవును అధిక ఒత్తిడితో బాధపడేవారు..బరువు పెరుగుతారని ఇది వరకే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఒత్తిడికి దూరంగా ఉండండి. యోగా, రన్నింగ్, వ్యాయామాలు చేస్తుండాలి. 

మద్యం, ధూమపానం:

మద్యం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిందే. అయినా కూడా కొంతమంది వీటికి దూరంగా ఉండలేపోతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలతోపాటు అధిక బరువు గురవుతున్నారు. కాబట్టి బరువు తగ్గేవారు ఆల్కహల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి. 

ప్రాసెసింగ్ ఫుడ్స్:

శుద్ది చేసిన పదార్థాలు, ప్యాక్డ్ ఫుడ్స్, సాల్టేడ్ ఫుడ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటిని అధికంగా తీసుకుంటే చిన్నతనంలో బొడ్డు కొవ్వు పెరుగుతుంది. 

Also Read : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget