By: ABP Desam | Updated at : 26 Aug 2022 01:36 PM (IST)
image credit: pixabay
చాలా మంది అన్ని ఆహారపదార్థాలు కలిపి తినేస్తూ ఉంటారు. సాధారణంగా ఆయా ఆహారాలను కలిపి తినడం మంచిది కాదనే అవగహన ఎవరికీ ఉండదు. కానీ, మనం తినే ఆహారాలు శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయంపై తప్పకుండా మనకు అవగాహన ఉండాలి.
కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. విటమిన్స్, మినరల్స్ సప్లిమెంట్స్ కలిపి తీసుకోవడం వల్ల వచ్చే లాభం కంటే అది ఆరోగ్యానికి చేసే హాని ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక అధ్యయనం వెలుగులోకి వచ్చింది. విటమిన్ ఎ, బీటా కెరొటిన్ కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆ నివేదిక చెబుతోంది.
ప్రస్తుత అధ్యయనం ప్రకారం విటమిన్స్, మినరల్స్ కోసం తీసుకొనే సప్లిమెంట్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం విటమిన్ ఎ, బీటా కెరొటిన్ కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయట. విటమిన్-ఎ సహజ యాంటీ ఆక్సిడెంట్, బీటా కెరొటిన్ మొక్కల నుంచి వచ్చే కెరొటీనాయిడ్. స్మోకింగ్ చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 28 శాతంగా ఉందని తెలిపారు.
సుమారు 18 వేల మంది మీద జరిపిన ఈ అధ్యయనంలో స్మోకింగ్ చేయని వాళ్ళని, చేసే వాళ్ళని దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పరిశీలించారు. వాళ్ళకి ప్రతి రోజు 30 మిల్లీగ్రాముల బీటా కెరొటిన్, 25000 IU విటమిన్ ఎ కలిపి ఇచ్చారు. నాలుగేళ్ల పాటు వాళ్ళని పరిశీలించిన తర్వాత ధూమపానం చేస్తున్న వారిలో ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం అధికంగా ఉన్నట్లు గురించారు. మయో క్లినిక్ ప్రకారం.. ధూమపానం చేసే వారు బీటా కెరొటిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. దాని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కానీ, ఆరోగ్యానికి బీటా కెరొటిన్ ఒక్కటి విడిగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బుల ప్రమాదాన్ని బీటా కెరొటిన్ ఉన్న ఆహార పదార్థాలు తగ్గిస్తాయి. బీటా కెరొటిన్ లభించే ఆహార పదార్థాలు ఇవే.
❂ బెల్ పెప్పర్స్ వంటి పసుపు రంగు కూరగాయలు
❂ రెడ్ బెల్ పెప్పర్స్
❂ క్యారెట్
❂ పాలకూర
❂ నేరేడు పండ్లు
❂ మామిడి
❂ బొప్పాయి
సప్లిమెంట్స్ ద్వారా బీటా కెరొటిన్ పొందాలని అనుకునే వాళ్ళు డాక్టర్ సిఫార్సు లేకుండా రోజు మొత్తం మీద 7 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ బీటా కెరొటిన్ తీసుకోకూడదు. అలా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: మీకు తెలుసా? ‘గర్భం’ వాయిదాకు అండాలను స్టోర్ చేసుకోవచ్చు, అది సురక్షితమేనా?
Also Read: తక్కువ సేపు నిద్రపోతున్నారా? ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకోవల్సిందే!
Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?
Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి
Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది
Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
/body>