News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Natural Leaves For Food: అరిటాకు మాత్రమే కాదు, ఈ ఆకుల్లో భోజనం తింటే ఆరోగ్యానికి శ్రేయస్కరం

కొంతమంది సంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం పెడతారు. కానీ ఇది మాత్రమే కాదు భారత్ లోని అనేక ప్రాంతాల్లో ఈ ఆకుల్లో కూడా భోజనం చేస్తారు. అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

FOLLOW US: 
Share:

పూర్వకాలంలో లోహపు పాత్రలు కనిపెట్టకముందు ప్రజలు అన్నం ఆకులలో మాత్రమే తినేవారు. క్రమంగా బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు, ఉక్కు వంటి వివిధ లోహాలతో పాత్రలు తయారు చేశారు. ఇప్పుడు స్టీల్, ఫైబర్ ప్లేట్స్ లో భోజనం చేస్తుంది. మరికొంత మందైతే స్టైల్ గా ఉంటాయని పింగాణి పాత్రలు ఉపయోగిస్తున్నారు. అయితే ఎన్నింటిలో తిన్నా అరిటాకులో భోజనం చేస్తే వచ్చే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. ఆయుర్వేదం కూడా ఆకుల్లో ఆహారం తీసుకోవడం కలిగే ప్రయోజనాలు గురించి చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అరిటాకులో తినే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. పెళ్ళిళ్ళు ఏదైనా శుభకార్యాలు అంటే ప్లాస్టిక్ ప్లేట్స్ దర్శనమిస్తున్నాయి.

భోజనం చేయడానికి అరిటాకు ఒక్కటే కాదు అలాంటి మరిన్ని ఆకులు కూడా ఉన్నాయి. అవి శుభప్రదమైనవి, ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. అలాంటి ఆకులు ఏమున్నాయో తెలుసుకుందామా..

అరటి ఆకు

నేటికీ దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అరటి ఆకులో ఆహారం తినాలనే నియమం ఉంది. ఆయా ప్రాంతాల్లోని రెస్టారెంట్స్ ఈ వెళ్తే సంస్కృతి, సంప్రదాయం ప్రకారం అరటి ఆకులోనే భోజనం వడ్డిస్తారు. ఇది బయోడిగ్రేడబుల్, డిస్పోజబుల్ ప్లేట్ల వినియోగాన్ని తగ్గిస్తుంది. పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. ఈ ఆకు మీద ఉండే సహజమైన పూత ఆహారానికి సూక్ష్మమైన రుచిని అందిస్తుంది. దీని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జీర్ణక్రియలో సమర్థవంతంగా సహాయపడతాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పలాస ఆకు

పలాస ఆకు చాలా పవిత్రమైనది. తినడానికి బాగుంటుంది. అంతే కాకుండా ఈ ఆకులలో ప్రసాదాన్ని దేవుడికి సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. నేటికీ ఈ పచ్చి ఆకులని సేకరించి వాటితో పాత్రావళి తయారు చేసి అమ్మేవాళ్ళు ఉన్నారు. ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఆకలిని మెరుగుపరుస్తుంది. పలాస ఆకులను ప్లేట్లుగా ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలమైంది. ఎందుకంటే ఇవి బయోడిగ్రేడబుల్.

సాల్, టేకు ఆకులు

సాల్, టేకు ఆకుల పరిమాణం పెద్దది. గట్టిగా ఉంటాయి. వాటిలో తినడం చాలా సులభం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్ల ఆకులు సులభంగా దొరుకుతాయి. ఈ చెట్టుని కల ఫర్నిచర్ తయారీకి ఉపయోగిస్తారు. అత్యంత ఖరీదైన కలపలో ఇదీ ఒకటి. వీటిని సాధారణంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. సాల్, టేకు ఆకులు రెండూ సహజ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆహారంపై హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధించడంలో సహాయపడతాయి. ఈ ఆకులు ఆహారానికి అదనపు రుచిని జోడిస్తాయి. అంతే కాదు అరటి ఆకుల మాదిరిగానే ఇవి కూడా పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యవు.

తామర ఆకులు

లోటస్ కుకుంబర్, పోఖారా ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ దాని ఆకుల గురించి మీకు తెలుసా? తామర పువ్వుని లక్ష్మీదేవిని పూజించడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఆహారాన్ని అందించే ప్రాంతాలు ఉన్నాయి. ఇవి సహజమైన హైడ్రోఫోబిక్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆహారం అంటుకోకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. వీటిలో తింటే ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. అంతే కాదు తామర ఆకు సువాసన భోజనానికి అంటుకుని మంచి అనుభూతిని కలిగిస్తుంది.

Also Read: ఈ పండు ఎప్పుడైనా తిన్నారా? అయితే, మీరు చాలా బెనిఫిట్స్ మిస్సవ్వుతున్నారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 21 Jun 2023 03:33 PM (IST) Tags: Banana Leaf Natural Leafs For Food Palas Leaf Lotus Leaf

ఇవి కూడా చూడండి

Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

Earplugs Side Effects : ఇయర్‌ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి

Earplugs Side Effects : ఇయర్‌ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు

Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు

World AIDS Day 2023 : పులిరాజా ఇప్పుడు సురక్షితమేనా? ఎయిడ్స్‌‌ను ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేమిటీ?

World AIDS Day 2023 : పులిరాజా ఇప్పుడు సురక్షితమేనా? ఎయిడ్స్‌‌ను ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేమిటీ?

టాప్ స్టోరీస్

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Nagarjuna Sagar Dispute: సాగర్ వివాదంపై కీలక సమావేశం - ఏం నిర్ణయించారంటే.?

Nagarjuna Sagar Dispute: సాగర్ వివాదంపై కీలక సమావేశం - ఏం నిర్ణయించారంటే.?

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ