అన్వేషించండి

Peaches: ఈ పండు ఎప్పుడైనా తిన్నారా? అయితే, మీరు చాలా బెనిఫిట్స్ మిస్సవ్వుతున్నారు!

ఎర్రగా యాపిల్ పండులాగా కనిపించే ఈ పండు పేరు పీచెస్. వేసవిలో లభించే పీచెస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

వేసవి ఎంతో రుచికరమైన పండ్లు అందిస్తుంది. మామిడి, పుచ్చకాయ మాత్రమే కాదు సమ్మర్ లో లభించే మరొక జ్యూసీ ఫ్రూట్ పీచెస్. జ్యూసీ ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యకర ప్రయోజనాల పవర్ హౌస్ గా దీన్ని చెప్పవచ్చు. పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి అనేక మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువ. శాచురేటెడ్ ఫ్యాట్ అసలు ఉండవు. అంతే కాదు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ గొప్ప మూలం. క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుచి తొలగించడంలో పీచ్ సహాయపడుతుంది. రేగు, ఆప్రికాట్లు, చెర్రీలు, బాదంతో పాటు పీచెస్ కూడా ఒకే కుటుంబానికి చెందినవి. పీచ్ ఫ్రూట్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. డెజర్ట్ లో దీన్ని తప్పకుండా వినియోగిస్తారు. చూసేందుకు ఎర్రటి యాపిల్ పండులాగా కనిపిస్తుంది. పీచ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

జీర్ణక్రియ

ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పీచెస్ చాలా ఉపయోగపడతాయి. ఇందులో కరిగే ఫైబర్ ఉండి. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది. మలబద్ధకం సమస్యని తొలగిస్తుంది. ఇదే కాదు.. జీర్ణ రుగ్మతల లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది. క్రోన్ స్ వ్యాధి, ఐబీఎస్, పెద్ద పేగులో మంట వంటి సమస్యల్ని తొలగిస్తుంది.

గుండెకి మేలు

గుండెకి మేలు చేసే అత్యుత్తమ పండ్లలో పీచెస్ ఒకటి. గుండెకి హాని కలిగించే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యల్ని తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

క్యాన్సర్ నుంచి రక్షణ

వివిధ రకాల క్యాన్సర్ల నుంచి రక్షణని అందించే మొక్కల సమ్మేళనాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉండే కెరొటీనాయిడ్స్, కెఫిక్ యాసిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలను చంపేస్తాయి. వాటి పురోగతిని అడ్డుకుంటాయి.

అలర్జీలు తగ్గిస్తుంది

పీచెస్ అలర్జీ వ్యాప్తిని నివారిస్తుంది. శరీరం అలర్జీకి గురైనప్పుడు దానికి సంబంధించిన కారకాలని తొలగించడంలో సహాయపడే రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేసే హిస్టామిన్ అనే రసాయనాలని విడుదల చేస్తుంది. రక్తంలోకి హిస్టామిన్ విడుదలను నిరోధించడం ద్వారా అలర్జీ లక్షణాలు తగ్గిపోతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అలర్జీ వల్ల కలిగే మంటని తగ్గించడంలో పీచెస్ లోని సమ్మేళనాలు ప్రభావవంతంగా పని చేస్తాయి.

స్కిన్ కి రక్షణ

పీచెస్ రక్షణ ప్రభావాలని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అతినీలలోహిత్ కిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో ఈ పండు సహాయపడుతుంది.

పీచెస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. జీర్ణ సమస్యలు, పేగు వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని తినకపోవడమే మంచిది. దీని వల్ల వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: హీట్ వేవ్ నుంచి శరీరాన్ని ఇలా రక్షించుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pineapple Tea : సమ్మర్ స్పెషల్ పైనాపిల్ టీ.. వేసవిలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
సమ్మర్ స్పెషల్ పైనాపిల్ టీ.. వేసవిలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Grow Coriander in Water : 15 రోజుల్లోనే కొత్తిమీరను పెంచవచ్చు తెలుసా? మట్టి లేకున్నా.. నీటిలోనే పెంచేయండిలా
15 రోజుల్లోనే కొత్తిమీరను పెంచవచ్చు తెలుసా? మట్టి లేకున్నా.. నీటిలోనే పెంచేయండిలా
Fenugreek Water : మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగాలా?
మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగాలా?
Mumbai Watermelon Tragedy : పుచ్చకాయ తింటే చనిపోతారా? ఎప్పుడు తినాలి? ఎలా తినకూడదు? ముంబై ఘటనతో బయటపడిన నిజాలు
పుచ్చకాయ తింటే చనిపోతారా? ఎప్పుడు తినాలి? ఎలా తినకూడదు? ముంబై ఘటనతో బయటపడిన నిజాలు

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
Riyan Parag Vaping Controversy: డ్రెస్సింగ్ రూంలో ఈ సిగరెట్ తాగిన రియాన్ పరాగ్, BCCI ఏ చర్యలు తీసుకుంటుంది!
డ్రెస్సింగ్ రూంలో ఈ సిగరెట్ తాగిన రియాన్ పరాగ్, BCCI ఏ చర్యలు తీసుకుంటుంది!
Chandrababu Speech: టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
AP SSC Exam Results 2026: రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Gayatri Gupta: పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
EPFO Updates:పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
Tamil Nadu Bengal Trends: తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
TDP Lokesh regime: టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
Embed widget