అన్వేషించండి

Palak Idly : పిల్లల పోషణకు పాలక్​ ఇడ్లీలు.. ఈ రెసిపీని ఫాలో అయిపోండి

Tasty Idly Recipe : మీ రోటీన్​ను హెల్తీగా మార్చుకోవాలంటే.. మీరు మీ బ్రేక్​ఫాస్ట్​లలో కూడా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. వాటిని ఎలా బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకోవచ్చో ఈ రెసిపీతో తెలుసుకుందాం.

South Indian Breakfast : రోజూ తినే ఇడ్లీలకు బదులు టేస్టీగా ఉండే ఇడ్లీలు తినాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యాన్ని కూడా మీకు అందిస్తుంది అంటున్నారు ఆహార నిపుణులు. మరి దీనిని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సి పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

ఇడ్లీ రవ్వ - 1 కప్పు

మినపప్పు - అర కప్పు

మెంతులు - అర టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

పాలకూర - అర కప్పు

పనీర్ - అర కప్పు

ఉల్లిపాయ - 1

పచ్చిమిర్చి - 1

అల్లం - అంగుళం

నూనె - అవసరానికి తగినంత

తయారీ విధానం

ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో మినపప్పు వేసి దానిని బాగా కడిగి ఓ గంట నానబెట్టాలి. దానిలో మెంతులు కూడా వేసి నాననివ్వాలి. మరో గిన్నెలో ఇడ్లీ రవ్వ తీసుకుని దానిని కూడా కడిగి నానబెట్టాలి. మీరు ఇడ్లీ చేసుకోవాలనుకునే గంటన్నర ముందు దీనిని నానబెట్టుకోవాలి. పాలకూరను బాగా కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పనీర్​ను తురిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కడిగి సన్నని ముక్కలుగా కోసుకోవాలి. అల్లం కూడా సన్నగా తురుముకోవాలి. 

మినపప్పును నానిన తర్వాత దానిని బాగా కడిగి మిక్సీలో గ్రైండ్ చేయండి. దానిలో ఉప్పు వేసి బాగా కలపండి. కొన్నిగంటలు దానిని అలాగే ఉండనివ్వండి. అనంతరం స్టౌవ్ వెలిగించి దానిలో కడాయిపెట్టండి. దానిలో ఉల్లిపాయలు వేసి వేయించండి. కాస్త నూనె వేసి కలిపి.. దానిలో పాలక్, పనీర్ కూడా వేసి ఫ్రై చేయండి. దానిలో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపండి. అవి వేగిన తర్వాత స్టౌవ్​ను ఆపేయండి. ఇడ్లీ అచ్చులకు నూనె అప్లై చేసి.. వాటిలో ఇడ్లీ పిండిని వేయాలి. దానిపై పాలక్​ మిశ్రమాన్ని వేయాలి. పాలక్ మిశ్రమాన్ని మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి.  

స్టౌవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్​ను ఉంచండి. సుమారు పది నుంచి పదిహేను నిమిషాలు ఆవిరి మీద వాటిని ఉడికించండి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. దీనిని మీకు నచ్చిన చట్నీ లేదా సాంబార్​తో కలిపి తీసుకోవచ్చు. ఇవి ప్రోటీన్​కు మంచి సోర్స్​ అని చెప్పవచ్చు. కాబట్టి జిమ్ చేసే వారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు వీటిని తయారు చేసుకోవచ్చు. పాలకూరను నేరుగా తినడం ఇష్టం లేని వారు ఇలా తీసుకోవడం వల్ల స్కిన్, హెయిర్​కి మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. 

పిల్లలు కూడా కొన్నిసార్లు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. బ్రేక్​ఫాస్ట్​లలో పాలకూరను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. పిలల్లో ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది. మధుమేహమున్నవారు కూడా దీనిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవచ్చు. ఇది అధికరక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేసి చిరుతిళ్లకు దూరంగా ఉండేలా చేస్తుంది. 

Also Read : మల్టీగ్రెయిన్ లడ్డూల రెసిపీ.. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా మంచివి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget