News
News
వీడియోలు ఆటలు
X

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

సరైన ఆహారం తీసుకుంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళే అవసరమే రాదు. అలా ఉండాలంటే మీ భోజనం ప్లేట్ లో ఈ ఆహారాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

FOLLOW US: 
Share:

ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిలబెడతాయి. కానీ ఎక్కువ మంది మనసు జంక్ ఫుడ్ వైపే మొగ్గు చూపుతుంది. వాటిని అతిగా తినడం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అందుకే శరీరం ఒకే రకమైన ఆహారానికి బానిస కాకుండా అన్నింటినీ సమతుల్యంగా తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీకెండ్ లో జంక్ ఫుడ్ తినాలని అనిపిస్తే అది తింటూనే వాటికి ఆరోగ్యకరమైన ఆహారాలు జత చేసుకోవాలి. అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మీ ప్లేట్ ని పోషకాహారమైన ధాన్యాలు, సీ ఫుడ్, బీన్స్, కాయధాన్యాలతో నింపేయండి. ఈ ఆహార పదార్థాలను తప్పకుండా మీ డైట్లో చేర్చుకుంటే ఎటువంటి రోగాలు మీ దరిచేరవు.

ఆకుపచ్చ కూరగాయలు

వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఆకుపచ్చ కూరగాయాలు తీసుకోవాలి. బ్రొకోలి, బ్రస్సెల్ మొలకలు వంటి కూరగాయలు, కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరలు మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.

బీన్స్, కాయధాన్యాలు

కనీసం వారానికి ఒకసారైన పప్పు తినాలి. బీన్స్, చిక్కుళ్ళని సూప్, క్యాస్రోల్స్, సలాడ్, డిప్ లకు జోడించుకోండి. ఇవి తింటే శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది. జీవక్రియని మరింత పెంచుతుంది.

తృణధాన్యాలు

ఆహారంలో రోజుకి కనీసం రెండు సార్లు తృణధాన్యాలు చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గోధుమ పిండి,ఓట్మీల్, బార్లీ, ఉసిరి, క్వినోవా పిండి లేదా మల్టీ గ్రెయిన్ పిండిని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఊబకాయాన్ని దూరం చేస్తుంది.

బెర్రీలు

ప్రతిరోజు రెండు లేదా నాలుగు బెర్రీలు తినేలా చూసుకోవాలి. రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలను మీ డైట్‌లో జ్యూస్, బ్రేక్ ఫాస్ట్ లేదా డెజర్ట్‌ల రూపంలో కూడా చేర్చుకోవచ్చు.

చేపలు

వారానికి రెండు మూడు చేపలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సీ ఫుడ్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, హెర్రింగ్, బ్లూ ఫిష్ వంటి వాటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

పెరుగు

కొన్ని అధ్యయనాల ప్రకారం 19 నుంచి 50 సంవత్సరాల మధ్య పురుషులు, స్త్రీలకు రోజుకి 1000ఎంజీ కాల్షియం అవసరమవుతుంది. యాభై ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి 1200 ఎంజీ అవసరం. రోజువారీ కాల్షియం అవసరాలని తీర్చడానికి తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు తీసుకోవచ్చు.

నట్స్, విత్తనాలు

ప్రతిరోజు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు లేదా ఇతర గింజలు తీసుకోవచ్చు. అల్పాహారంలో లేదంటే షేక్స్, స్మూతీస్ రూపంలో వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో పాటి పావు కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది.

నీరు

అన్నింటికంటే ముఖ్యమైనది నీరు పుష్కలంగా తాగడం. రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా టాక్సిన్స్ ను బయటకి పంపించి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?

Published at : 22 Mar 2023 09:00 AM (IST) Tags: Health Tips Food Habits Healthy Food Nuts Green Vegetables

సంబంధిత కథనాలు

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

Sleeping Together: జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Sleeping Together: జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Chinese Woman: షాపింగ్‌ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై

Chinese Woman: షాపింగ్‌ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్