By: ABP Desam | Updated at : 02 Feb 2023 03:24 PM (IST)
Edited By: Bhavani
Image Credit /pixabay
మనలో మూడింట ఒక వంతు జనాభా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. అంతేకాదు 48 శాతం మంది నిద్ర లేమి వల్ల తమ మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతోందని కూడా కంప్లైంట్ చేస్తున్నారట. నిద్ర లేమి అనేది అసలైన సమస్య, ఆందోళన కలిగించే విషయం కూడా దీన్ని నివారించేందుకు ప్రయత్నించాలి అని డాక్టర్ నీల్ స్టాన్లీ కామెంట్ చేశారు.
రాత్రి సమయంలో చేసే పనుల్లో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే 8 గంటల నిద్ర తప్పకుండా ఉంటుంది. ఫలితంగా శారీరకంగా ఆరోగ్యంగానూ, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం స్లీప్ ఎక్స్ పర్ట్ డాక్టర్ స్టాన్లీ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
⦿ వాతావరణం చల్లగా ఉన్నపుడు లేదా నిద్రించే గది చల్లగా ఉన్నపుడు నిద్ర పట్టేందుకు సమయం పడుతుంది. ఎందుకంటే చల్లని పరిసరాల్లో శరీరం తన ఉష్ణోగ్రతను కొంత మేర కోల్సోతుంది. తిరిగి నార్మల్ అయ్యే వరకు నిద్ర పట్టకపోవచ్చు. కనుక బెడ్ రూం వెచ్చగా ఉండేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా బెడ్ రూంలో టెంపరేచర్ 16-18 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు ఉండేలా చూసుకుంటే మంచిది.
⦿ నిద్ర పోవడానికి దాదాపుగా 30-45 నిమిషాల ముందే పని ఆపేసి కంప్యూటర్లు స్విచ్ ఆఫ్ చెయ్యాలి. ఈ సమయంలో వీలైనంత వరకు రిలాక్సయ్యే పనులు చేసుకోవడం మంచిది. అది మెడిటేషన్ కావచ్చు, మంచి మ్యూజిక్ కావచ్చు, లేదా పుస్తకం చదువుకోవడం కావచ్చు, లేదా కుటుంబంతో గడపడం కావచ్చు. అప్పటికీ నిద్ర రాకపోతే వేరే గదిలోకి వెళ్లి నిద్ర వచ్చే వరకు ఏదైనా వేరే పని చేసే ప్రయత్నం చెయ్యలి. అంతేకానీ మంచంలో పడుకొని నిద్ర రావడం లేదని విసుగు చెందడం వేస్ట్, అందువల్ల మరింత ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్ స్టాన్లీ చెబుతున్నారు.
⦿ రాత్రి పొద్దుపోయాక చేసే వర్కవుట్ కచ్చితంగా నిద్రను ప్రభావితం చేస్తుంది. సాయంత్రం వర్కవుట్ చెయ్యడం మంచిదే, కానీ రాత్రి పూట వర్కవుట్ వల్ల నిద్రా భంగం అవుతుంది. కనుక రాత్రి వర్కవుట్లను మానేయ్యాలి
⦿ కొత్త ప్రదేశంలో నిద్ర పట్టడం కష్టమవుతుంది. దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు. కొత్త ప్రదేశంలో, కొత్త శబ్ధాల వల్ల నిద్ర పట్టేందుకు కష్టం అవుతుంది. సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నట్టు బ్రెయిన్ నమ్మితేనే నిద్రపొయ్యేందుకు సహకరిస్తుంది, అది ప్రమాదకరం కాకపోయినా మేలుకొని ఉండేందుకే ప్రయత్నిస్తుంది. అందువల్లే కొత్త ప్రదేశాల్లో నిద్ర రాదు. కొత్త ప్రదేశంలో నిద్రకు ఉపక్రమించే ముందు లైట్లు ఆపేసి, నిశ్శబ్ధంగా ఉంటే త్వరగా నిద్ర పట్టవచ్చు. మరుసటి రాత్రి కి మరింత మెరుగ్గా ఉండొచ్చు.
⦿ మనుషులు మాత్రమే మరొకరితో కలిసి పడుకుంటారు. ఈ సృష్టిలో ఇది చాలా అసహజమైన విధానమని స్టాన్లీ కామెంట్ చేశారు. వేరు వేరు బెడ్ లో పడుకునేందుకు ప్రయత్నించాలి. వీలైతే వేరువేరు రూముల్లో నిద్రపోవాలని ఆయన సూచిస్తున్నారు. మీకోసం ప్రత్యేకంగా నిద్రించే ప్రదేశం ఉండడం అనేది ఎంత మంచి సెక్యూర్ ఫీల్ ను ఇస్తుందో చెప్పలేమని అన్నారు ఆయన. అయితే అందరికీ ప్రత్యేక బెడ్ రూమ్ లు ఉండడం సాధ్య పడకపోవచ్చు.
⦿ గురక పెట్టే వ్యక్తులతో కలిసి పడుకోవాల్సి వస్తే అది అత్యంత పెద్ద అసౌకర్యంగా మారొచ్చు. మీ పార్టనర్ తో మీరు ఆ విషయం గురించి చర్చించవచ్చు. నాజల్ స్ట్రిప్స్ వాడడం, పక్కకు తిరిగి పడుకోవడం, బరువు తగ్గడం వంటివి గరక ను నివారించడంలో మంచి పరిష్కారం చూపగలవు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో సమయానికి నిద్ర పోవడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: గీజర్‌లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే
Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?
ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ
Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే
Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి