Snakes Attract Plants: మీ గార్డెన్‌లో ఈ మొక్కలు ఉన్నాయా? పాములు వస్తాయ్ జాగ్రత్త!
చాలా మంది మహిళలు తమ పెరట్లో చక్కగా మొక్కలు పెంచుకుంటారు. అయితే, కొన్ని మొక్కల కారణంగా పాములు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకీ పాములను ఆకర్షించే ప్లాంట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Snakes Attract Plants: ఇంటి పరిసరాల్లో చక్కగా మొక్కలు పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? మహిళలకు గార్డెనింగ్ అంటే ఎక్కలేని ఇష్టం. ఇంట్లో ఖాళీ జాగా ఎక్కడ కనిపించినా.. ఏదో ఒక్క మొక్క నాటేస్తుంటారు. కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలతో పాటు ఇంటికి ఆకర్షణ అందించే మొక్కలను కూడా పెంచుతారు. ఇంట్లో ఎన్ని చెట్లు ఉంటే ఆ ఇంటికి అంత కళ వస్తుంది. మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల చక్కటి గాలి లభిస్తుంది. అయితే, కొన్ని మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల పాములు వచ్చే అవకాశం ఉంటుంది. సువాసనలు వెదజల్లే మొక్కలకు పాములు బాగా అట్రాక్ట్ అవుతాయి. ఇంతకీ ఏ మొక్కల కారణంగా పాములు వస్తాయో? ఇప్పుడు తెలుసుకుందాం..
పాములను ఆకర్షించే మొక్కలు
సిట్రస్ మొక్కలు
నిమ్మ, బత్తాయి మొక్కల పూలు కూడా మంచి సువాసనను వెదజల్లుతాయి. కొన్ని మీటర్ల వరకు ఈ పూల వాసన వస్తుంది. పూలు పూసే సమయంలో ఈ చెట్ల దగ్గరికి పాములు బాగా వస్తాయి.
లిల్లీ
లిల్లీ పూల మొక్కలు ఉన్న ప్రాంతానికి పాములు ఎక్కువగా వచ్చి చేరుతాయి. ఈ మొక్క నుంచి వచ్చే పూలు బలమైన సువాససను కలిగి ఉంటాయి. ఆ వాసన పాములను ఆకర్షిస్తుంది.
క్లోవర్ ప్లాంట్
క్లోవర్ ప్లాంట్ మొక్క గుబురుగా చక్కటి నీడను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి వచ్చే చల్లదనాన్ని ఆస్వాదించేందుకు పాములు ఇష్టపడుతాయి.
మోత్ ఆర్కిడ్
మోత్ ఆర్కిడ్ మొక్కల పూలు చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. సువాసనలు వెదజల్లుతాయి. ఈ మొక్కల పూలు కీటకాలను బాగా ఆకర్షిస్తాయి. ఈ చెట్టు నుంచే వచ్చే వాసనకు పాములను కూడా ఆకర్షించబడుతాయి.
నిమ్మగడ్డి
సిట్రస్ జాతికి చెందిన లెమన్ గ్రాస్ సువాసన కలిగి ఉంటుంది. లెమన్ గ్రాస్ జ్యూస్ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ గడ్డి సువాసనను కలిగి ఉన్న కారణంగా పాములు వచ్చే అవకాశం ఉంటుంది.
పైనాపిల్ సేజ్
పైనాపిల్ సేజ్ చూడ్డానికి పొదలా కనిపించే మొక్క. ఎర్రటి పూలతో అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ చెట్టు సువాసలను వెదజల్లుతుంది. ఈ చెట్టు నుంచి విడుదలయ్యే స్మెల్ కు పాములు బాగా ఆకర్షించబడుతాయి.
పుదీనా
పుదీనా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సువాసనలు వెదజల్లే ఈ ఆకుకూరను వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తాయి. పుదీనా నుంచి వెలువడే సువాసనకు పాములు ఆకర్షింపబడుతాయి.
మల్లె
మల్లె చెట్టు గుబురు పొద మాదిరిగా ఉంటాయి. మల్లెపూలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. ఈ పూల వాసనకు పాములు బాగా ఆకర్షింపబడుతాయి.
లెమన్ బామ్
లెమన్ బామ్ అనేది ఔషధ మొక్క. ఈ మొక్క కూడా చక్కటి స్మెల్ ను కలిగిస్తుంది. ఈ వాసనకు పాములు వచ్చి చేరుతాయి.
హోస్టా
హోస్టా అనేది గుబురుగా పెరిగే పొదలాంటి మొక్క. చక్కటి సువాసన కలిగి ఉంటుంది. దీని పూలు సుమారు 10 సెంటీ మీటర్ల వరకు పెరుగుతాయి. తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పూల నుంచి వచ్చే వాసన కారణంగా పాములు వస్తాయి.