కొండ చిలువ పాములను మింగడం తెలిసిందే. కానీ, పామే ఆ పని చేస్తే? మియామీ జూలో అదే జరిగింది. కాటన్ మౌత్ పాము కొండ చిలువను మింగేసింది. మియామీ జూ డాక్టర్లు ఇటీవల బర్మీస్ పైథాన్‌కు ట్రాకింగ్ ట్రాన్స్ మీటర్ అమర్చారు. రోజూ అది ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసుకొనేవారు. ఓ రోజు డాక్టర్లకు.. ఆ కొండ చిలువను ఓ పాము మింగేసిందని తెలిసింది. ట్రాకింగ్ ట్రాన్స్‌మీటర్ సాయంతో దాని ఆచూకీ తెలుసుకుని, పామును పట్టుకున్నారు. ఆ పాముకు ఎక్స్‌రే తీస్తే.. దాని కడుపులో కొండ చిలువ చనిపోయి కనిపించింది. ఆ ఎక్స్‌రేను జూ మియామీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ ఎక్స్ రే ఇదే. ఆ ఎక్స్‌రే ఫొటోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. (Representational Image/Pexels) Images & Video Credit: Pexels and Pixabay