డయాబెటిస్‌తో ఉపవాసం చేయచ్చా? మధుమేహం వచ్చిందా తినే ఆహారం దగ్గర నుంచి, ఆ ఆహారం తినే సమయాల విషయం వరకు చాలా జాగ్రత్తలు పాటించాలి. మధుమేహం ఉన్న వారు ఖాళీ పొట్టతో ఎక్కువ సమయం ఉండకూడదని చెబుతారు వైద్యులు. మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఏమీ తినకుండా ఉంటే వారిలో మార్పులు మొదలవుతాయి. అదే ఆరు గంటల పాటూ ఏమీ తినకూండా ఉంటే శరీరంలో కొవ్వును కరిగించుకుని శక్తిగా మార్చుకోవడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్, ఎసిటోన్ ఆమ్ల పదార్థాలు అధికంగా విడుదలవుతాయి. ఇవి శరీరంలో అధికంగా పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. అందుకే మధుమేహులు ఎక్కువ గంటల పాటూ తినకుండా ఉండకూడదు. ఉపవాసం జోలికి డయాబెటిస్ రోగులు వెళ్లకపోవడమే ఉత్తమం.