టేస్టీ సగ్గుబియ్యం దోశెలు

సగ్గుబియ్యం - ఒక కప్పు
పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
సామలు - అర కప్పు
నీళ్లు - సరిపడా
నూనె - తగినంత

సగ్గుబియ్యాన్ని నాలుగ్గంటలపాటూ నానబెట్టాలి.

సామల్ని కూడా అరగంట పాటు నానబెట్టాలి.

మిక్సీలో నానబెట్టిన సగ్గుబియ్యం, సామలు, ఉప్పు, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఒక గిన్నెలోకి రుబ్బుని తీసి పెట్టుకోవాలి.

దోశెలు వేసేందుకు జారేలా రుబ్బులో అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు.

పెనంపై కాస్త నూనె రాసి పల్చగా దోశెల్లా వేసుకోవాలి. ఈ దోశెల్ని కొబ్బరి చట్నీ, టమోటా చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.