కొంతమంది బరువు తగ్గేందుకు ఒక పూటే తింటారు. అలా చేయడం ఆరోగ్యకరమేనా? ఒక పూట మాత్రమే భోజనం చేసేవాళ్లు. ఆ పూట ఎక్కువ ఆహారాన్ని తింటారట. రోజుకు సరిపడా ఆహారం ఒకేసారి తినడం వల్ల జీవక్రియ మందగిస్తుందట. ఒకపూట మాత్రమే భోజనం చేసేవారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఒక పూట భోజనం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందవు. అయితే, ఒక పూట భోజనం చేసేవారికి బరువు త్వరగా తగ్గుతారు. చక్కెర స్థాయిలు పడిపోయి వణుకు వస్తుంది. ఇది డయాబెటిస్‌కు డేంజర్. ఏకాగ్రత దెబ్బ తింటుంది. ఏ పని చేయలేరు. రోజంతా చికాకుగా ఉంటుంది. ఆకలి ఎక్కువగా ఉండటం వల్ల మధ్య మధ్యలో చిల్లర తిండ్లు ఎక్కువగా తీసుకుంటారు. మధ్య మధ్యలో తీసుకొనే ఆహారం వల్ల సింగిల్ మీల్స్ డైట్ పెద్దగా వర్కవుట్ కాదు. Images & Video Credit: Pexels