రోజు ఆపిల్ తింటే డాక్టర్‌తో పనే ఉండదని అంటారు. అది కొంతవరకు నిజమే.

కానీ, ఆపిల్ పండ్లను పండించడమంటే అంత సులభం కాదు.

ఆపిల్ పండ్లను పండించేందుకు తగిన వాతావరణం ఉండాలి.

అందుకే, మన దేశంలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆపిల్స్‌ను పండిస్తున్నారు.

దేశంలో అత్యధికంగా జమ్ము కశ్మీర్‌లోనే యాపిల్ తోటలు ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లోనూ ఆపిల్ పండిస్తారు.

దక్షిణాదిలో కేవలం తమిళనాడులో మాత్రమే ఆపిల్ పండిస్తున్నారు.

వీటిలో కశ్మీర్ ఆపిల్ టేస్టీగా ఉంటుందట. ఇందుకు వాతావరణం, మట్టే కారణం.

హిమాచల్ ప్రదేశ్‌లో పండే షిమ్లా ఆపిల్స్ కూడా బాగా ఫేమస్. ఇవి ఎర్రగా భలే ఉంటాయ్.

మొత్తం 15 రకాల ఆపిల్స్ ఇండియాలో పెరుగుతున్నాయి.

వీటిలో అత్యంత టేస్టీగా ఉండేది అంబ్రీ ఆపిల్. దీన్నే కశ్మీరీ ఆపిల్ అని కూడా అంటారు.

సముద్ర మట్టానికి 1500 పైగా ఎత్తు, 24 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలోనే ఇవి పండుతాయ్.

Images & Videos Credit: Pexels and Pixabay