ఎండు బొప్పాయితో లాభాలెన్నో ఎండు కొబ్బరిలాగే ఎండు బొప్పాయి కూడా మార్కెట్లో దొరుకుతుంది. దీని రుచి చాలా బాగుంటుంది. చూడటానికి క్యాండీస్‌లా కనిపిస్తాయి. దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్ధరైటిస్ ఉన్న వారికి ఇవి తింటే ఎంతో మంచిది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.