ఎర్రకందిపప్పు గారెలు... వెరీ టేస్టీ

ఎర్రకంది పప్పు - ఒక కప్పు
పచ్చిమిర్చి - రెండు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
అల్లం ముక్క - చిన్నది
మిరియాల పొడి - అర స్పూను

ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - ఒక స్పూను
కొత్తి మీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడనన్ని
నూనె - సరిపడా

ఎర్ర కందిపప్పు నీళ్లల్లో నానబెట్టాలి.

నీళ్లు ఒంపేసి మిక్సీలో పప్పు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి కాస్త నీళ్లు వేసి రుబ్బుకోవాలి.

ఉల్లిపాయలను నిలువగా కోసి ఆ రుబ్బులో కలుపుకోవాలి.

అలాగే ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.

పెనంపై రెండు స్పూన్ల నూనె వేయాలి.

రుబ్బును తీసుకుని గారెల్లా అద్దుకుని పెనంపై కాల్చుకోవాలి.

రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని పుదీనా చట్నీతో తినాలి.