బీట్‌రూట్ ఎందుకు తినాలి? బీట్‌రూట్లో విటమిన్ బి9 పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల పెరుగుదలకు అవసరం. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మధుమేహం ఉన్న దీన్ని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో యాంటీ ఇనఫ్లమ్మేషన్ గుణాలు ఎక్కువ. మెదడుకు రక్తప్రసరణను పెంచి పనితీరును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ను నివారించే లక్షణాలు దీనిలో ఎక్కువ. శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో బీట్‌రూట్ ముందుంటుంది.