రమ్ దేనితో తయారుచేస్తారో తెలుసా?



చల్లని వాతావరణంలో ఘాటైన రమ్ గొంతులోకి జారుతుంటే ఆ కిక్కేవేరు.

మొదటిసారి రమ్‌ను ఏ దేశంలో తాగారో తెలుసా? కరేబియన్ దీవుల్లో.

1620లో దీన్ని అక్కడ తయారుచేసి తాగినట్టు చరిత్ర చెబుతోంది.

ఇప్పటికీ కరీబియా ప్రాంతంలోని ప్యూర్టోరికాలోని శాన్‌జువాన్లో అతి పెద్ద రమ్ డిస్టిలరీ ఉంది. ఇక్కడ ప్రతిరోజూ లక్ష లీటర్ల ఉత్పత్తి చేస్తారు.

రమ్ తయారీకి వాడే మూల పదార్థం చెరకు. అందుకే ఇది చాలా స్పెషల్ మద్యం అని చెప్పాలి.

చెరకును ఉడకబెట్టి, స్కిమ్మింగ్ చేసి, అందులో మిగిలిన మొలాసిస్, అవక్షేపాలతో రమ్‌ను తయారు చేస్తారు.

ముఖ్యంగా మొలాసిస్, అవక్షేపాలను పులియబెట్టడం ద్వారా దీన్ని రూపొందిస్తారు.

రమ్ తాగని వారి కంటే, రమ్ అతి తక్కువగా ఎంతో కొంత తాగేవారిలో కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 38 శాతం తక్కువని రుజువైంది.