సంబంధాలు మేనేజ్‌చేసుకోవడం ఓ ఆర్ట్. అది తెలిసిన వ్యక్తే ఉత్తమ పురుషుడు సపోర్టివ్‌గా ఉండాలి- జీవితంలోని అన్ని దశల్లో మద్దతు ఇస్తూ ప్రోత్సహించాలి. మిమ్మల్ని గౌరవించాలి- బంధానికి మూలస్తంభం గౌరవం. భాగస్వామిని గౌరవించాలి. అభినందించాలి. నమ్మకస్తుడు- నమ్మకం లేకుండా ప్రేమ, గౌరవానికి పునాది లేదని అర్థం చేసుకోవాలి. మాట తప్పకపోవడం- ఎంత కష్టం వచ్చినా ఇచ్చిన మాటకు గౌరవించి నెరవేర్చడం. భావోద్వేగాలు ఉన్నవాడు- సంకోచం భయం లేకుండా మనసులోని మాట చెప్పే వ్యక్తి శాశ్వతంగా కలిసిపోయే వ్యక్తి. అవసరాలు తెలుసుకునే వ్యక్తి- భాగస్వామికి జీవితంలో ఏది ఎక్కువగా అవసరమో అర్థం చేసుకోవాలి. వాటిని ప్రోత్సహించాలి ఎప్పుడూ ప్రేమిస్తుండాలి- ప్రేమ లేకుండా, సంరక్షణ, గౌరవం, నమ్మకం, ఇతర భావోద్వేగాలకు చోటు లేదు.