పుదీనా పొడి... ఇలా చేస్తే ఏడాదంతా నిల్వ



పుదీనా ఆకులు - ఒక కప్పు
ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు
మినప్పప్పు - పావు కప్పు
శెనగ పప్పు - అరకప్పు

ఎండు మిర్చి - పది
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు - చిన్న ఉండ
నూనె - మూడు స్పూనులు

పుదీనా ఆకును వేయించి పక్కన పెట్టుకోవాలి.



అలాగే మినపప్పు, శెనగపప్పు, ఎండు కొబ్బరితురుము, ఎండు మిర్చి వేయించాలి.



మిక్సీలో అన్నీ కలిపి చింత పండు వేసి పొడి కొట్టాలి.



నచ్చితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు.



దీన్ని గాలి చొరబడని డబ్బాల్లో వేస్తే ఏడాదంతా నిల్వ ఉంటుంది.