ఫేస్ రోలర్‌తో అందం రెట్టింపు సెలెబ్రిటీలు ఈ మధ్య బాగా వాడుతున్న బ్యూటీ పరికరం ఫేస్ రోలర్. రెండు వైపులా రెండు నున్నని రాళ్లు కూర్చి ఉంటాయి. క్వార్ట్జ్ రాళ్లను ఇందుకు వాడతారు. ముఖంపై వాపును (పఫ్ నెస్) తగ్గిస్తుంది. చర్మానికి సాంత్వన చేకూరుస్తుంది. ముఖంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖంపై రక్తప్రసరణ పెంచి అందం రెట్టింపయ్యేలా చేస్తుంది. ఈ ఫలితాలు ఎక్కువ కాలం ఉండాలంటే ఈ రోలర్ వాడాలి. దీని ధర మరీ ఖరీదెక్కువేం కాదు.