మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు

పొరలను తీస్తుంటే అరటి పువ్వులు బయటపడుతుంటాయి, అలా పొరలు తీస్తున్న కొద్దీ పువ్వులు వస్తూనే ఉంటాయి.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు ఉండదు కాబట్టి బరువు తగ్గొచ్చు.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అరటిపువ్వులోని పోషకాలు బాగా పనిచేస్తాయి.

మధుమేహులకు అరటిపువ్వుతో చేసిన వంటకాలు తినడం అత్యవసరం.

ఈ పువ్వులో ‘క్వెర్సెటిన్, కాటెచిన్’ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పువ్వులోని పోషకాలు సహకరిస్తాయి.

ఎముకలు గట్టిగా, బలంగా ఉండాలంటే అరటిపువ్వును తరచూ తినాలి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలు త్వరగా దెబ్బతినకుండా కాపాడతాయి.