క్యాన్సర్‌ను తగ్గించే అవిసె గింజలు అవిసె గింజల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిని తినడం వల్ల ప్రొటీన్లు, ఫైబర్లు, ఒమెగా 3ఫ్యాటీ ఆమ్లాలు అందుతాయి. గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లిగ్నాన్లు అనే పోషకాలు ఉంటాయి, ఇవి క్యాన్సర్ ను నిరోధిస్తుంది. జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే అధిక ఫైబర్, తక్కువ కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో రక్తపోటును, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అవిసెగింజలతో చేసే అనేక రకాల వంటలను వండి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.