నోరూరించేలా...కొబ్బరి రవ్వ లడ్డూ



బొంబాయి రవ్వ - రెండు కప్పులు
పాలు - అర కప్పు
నెయ్యి - మూడు స్పూన్లు
ఎండు కొబ్బరి పొడి - ఒక కప్పు



చక్కెర - ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి - అర స్పూను
కిస్‌మిస్‌లు - పావు కప్పు
జీడిపప్పులు - పది

కళాయిలో నెయ్యి వేసి బొంబాయి రవ్వ, ఎండుకొబ్బరి పొడి వేసి వేయించాలి.

అవి వేగాక చక్కెర వేయాలి.

మిశ్రమం చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేసి కలపాలి.

రవ్వ మిశ్రమం చల్లారాక కాస్త పాలు వేసి కలపాలి.

వేయించిన కిస్‌మిస్, జీడిప్పులు వేసి కలపాలి.

మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుని లడ్డూల్లా చేసుకోవాలి. కొబ్బరి రవ్వ లడ్డూ సిద్ధం.