పుట్టగొడుగులున్న చెట్టు కింద నిల్చుంటే చాలా డేంజర్ చెట్టు ఆకులు పచ్చగా, నిండుగా కనిపిస్తున్నప్పటికీ చెట్టు చుట్టూ పుట్టగొడుగులు కనిపిస్తే మాత్రం డేంజర్. చెట్టు ఏ క్షణంలోనైనా కూలిపోతుందని సూచించే ప్రధాన హెచ్చరిక అనుకోవచ్చు దీన్ని. పుట్టగొడుగులు ఒకరకమైన శిలీంధ్రాలు. ఇవి చెట్టు కింద పెరుగుతున్నాయి అంటే ఆ చెట్టు క్షీణించడం మొదలైందని అర్థం. చెట్లలోని చెక్కను తినేస్తూ పుట్టగొడుగులు ఎదుగుతాయి. చెట్టుపై పుట్టగొడుగులు పెరుగుతున్నాయి అంటే దానికి మరణశిక్ష పడినట్టే. అవసరమైన పోషకాలను ఇవి తినేస్తాయి. చెట్టును బలహీనపరుస్తాయి. చివరికి చెట్టుకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే చెట్టు చుట్టూ పుట్టగొడుగులు కనిపిస్తే దాని కింద ఉండొద్దు.