గోల్డెన్ హనీ గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే...



గోల్డెన్ హనీ రోజుకో స్పూను తాగమని సిఫారసు చేస్తారు ఆయుర్వేద వైద్యులు.



గోల్డెన్ హనీ అంటే సాధారణ తేనెలో పసుపు కలపడమే.



దీన్ని తాగితే శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు అందడంతో పాటూ రక్షణ దక్కుతుంది.



గోరు వెచ్చని నీళ్లలో ఈ తేనెను కలుపుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.



ఈ తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. శరీరంలో తీవ్రమైన నొప్పి, ఇతర రకాల వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.



దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ తేనె శరీరంలో చేరే హానికర బ్యాక్టరియాలు, వైరస్‌లను చంపుతుంది.



సాధారణ తేనె కన్నా గోల్డెన్ హనీ తాగడం వల్ల రెట్టింపు ఆరోగ్యం.



పసుపులో కూడా ఎన్నో సుగుణాలు ఉంటాయి. అవి తేనెకు జోడవుతాయి.