మీరు బంగాళా దుంపలు ఎక్కువ తింటున్నారా? మీరు ఈ విషయం తెలుసుకోవల్సిందే. బంగాళా దుంపలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచివే. కానీ, లైంగిక సామర్థ్యానికి మాత్రం బంగాళా దుంపలు మంచివి కావు. ఆలు గడ్డల్లో పిండి పదార్ధం ఎక్కువ. నిస్సత్తువగా చేస్తుంది. కాబట్టి మీరు మూడ్‌లో ఉన్నప్పుడు బంగాళా దుంప ముట్టొద్దు. కానీ, స్వీట్ పొటాటో (చిలకడదుంప) మాత్రం సెక్స్ డ్రైవ్‌ను పెంచుతాయ్. చిలకడ దుంపలో ఉండే విటమిన్-E వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. చిలకడ దుంపలో ఉండే విటమిన్-A క్యాన్సర్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది. అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుంచి చిలకడ దుంప రక్షణ కల్పిస్తుంది. రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. Images and Videos: Pexels, Unsplash & Pixabay