మగవారు బ్రేకప్ చెప్పడానికి కారణాలు ఇవే

మగవారు ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి మధ్యలోనే బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి.

వ్యక్తిగత స్వేచ్ఛ ప్రియురాలి వల్ల అతను కోల్పోయినట్టు ఫీలైనా బ్రేకప్ చెప్పేస్తాడు.

ప్రియురాలితో కలిసి మంచి భవిష్యత్తు ఉన్నట్టు అతనికి అనిపించక పోయినా విడిపోతాడు.

అమ్మాయి వ్యక్తిత్వం, నడవడిక, మాటతీరు నచ్చకపోయినా బైబై చెప్పేస్తాడు.

అమ్మాయితో డీప్ కనెక్షన్ ఏర్పడకపోయినా ఆ బంధాన్ని వదిలేయడం ఖాయం.

ఫిర్యాదులు చెప్పడం, విమర్శలు చేసే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు. బ్రేకప్ అంటారు.

అమ్మాయి వల్ల తన కెరీర్ పాడవుతుందని అబ్బాయి భావించినా, లేక అనుకున్న లక్ష్యం చేరడానికి ప్రేమే అడ్డంకి అనుకున్నా బ్రేకప్ చెప్పేస్తాడు.

బాసిజం చూపించే ప్రియురాలిని ఎక్కువ కాలం భరించలేరు.

డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే అమ్మాయి అనిపిస్తే వెంటనే బ్రేకప్ చేసుకుంటారు.