టేస్టీగా రొయ్యల ఫ్రైడ్ రైస్

చిన్న రొయ్యలు - పావుకిలో
వండిన అన్నం - రెండు కప్పులు
మిరియాల పొడి - చిటికెడు
గుడ్డు - ఒకటి
సోయా సాస్ - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
ఫిష్ సాస్ - ఒక స్పూను
నూనె - 2 స్పూనులు
క్యారెట్ - ఒకటి
పసుపు - చిటికెడు
కారం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - 2 స్పూనులు

స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు నిలువుగా కోసి వేయించుకోవాలి.

వాటిలో శుభ్రంగా కడిగిన రొయ్యలు వేసి వేయించాలి.

అందులో పసుపు, కారం, ఉప్పు వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి.

కోడి గుడ్డు కొట్టి వేసి కలపాలి.

వండిన అన్నం, ఫిష్ సాస్, సోయా సాస్, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

దించే ముందు తరిగిన కొత్తి మీర చల్లి సర్వ్ చేయాలి.