అన్వేషించండి

DIY Coffee Scrubs : కాఫీ స్క్రబ్ DIYలు.. వీటితో కలిపి తీసుకుంటే చర్మానికి ఎన్ని ప్రయోజనాలో

Perk up Your Skin with Coffee : కాఫీ తాగడానికే కాదు అండోయ్.. స్కిన్​ కేర్​లో కూడా ఓ ముఖ్యమైన భాగమని మీకు తెలుసా? కాఫీ పౌడర్​ను కొన్ని పదార్థాలతో కలిపి అప్లై చేస్తే మీరు స్కిన్​ బెనిఫిట్స్ పొందవచ్చు.

Coffee Scrubs for Healthy Skin : హెల్తీ స్కిన్​కోసం పార్లర్​కే వెళ్లాల్సిన అవసరం లేదు. వంటగదిలోకి వెళ్లిన చాలు. అక్కడే దొరికే ఎన్నో పదార్థాలు మీ స్కిన్​ కేర్ రోటీన్​లో చేర్చుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాఫీ. అవును కాఫీ పౌడర్​తో మీరు మెరిసే చర్మం పొందుకోవచ్చు. అయితే కాఫీ పౌడర్​లో కొన్ని కలిపి తీసుకుంటే మీరు మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇది కేవలం ముఖానికే అనుకుంటే పొరపాటే. కాఫీ పౌడర్​తో చేసుకునే అన్ని స్క్రబ్​లను మీరు పూర్తి శరీర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. 

మీరు ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందాలనుకుంటే కాఫీ స్క్రబ్​లను ప్రయత్నించవచ్చు. పిగ్మెంటేషన్​ను తగ్గించి.. సహజమైన ఎక్స్​ఫోలియేట్​గా చేస్తాయి. చర్మంపై పేరుకుపోయిన మృత చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తాయి. ఇవి మీ ఛాయను మెరుగుపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది మీ స్కిన్ మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, ముడతలు లేకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.ఈ స్క్రబ్​ల నుంచి వచ్చే సువాసన మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయితే కాఫీ పౌడర్​లో ఎలాంటి పదార్థాలు కలిపితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

కొబ్బరి నూనెతో.. 

ఓ గిన్నెలో కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను కలిపి చర్మానికి అప్లై చేయండి. సున్నితంగా రెండు నిముషాలు చర్మంపై స్క్రబ్ చేయండి. అనంతరం గోరువెచ్చని నీటితో మీరు శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనిని మీరు వారంలో రెండు సార్లు ఉపయోగించవచ్చు. 

పంచదారతో..

కాఫీ పౌడర్​లో పంచదార, కొబ్బరినూనె వేసి బాగా కలపండి. దీనిని కూడా మీరు శరీరానికి బాగా అప్లై చేయవచ్చు. దీని చర్మంపై అప్లై చేసి.. రెండు నిమిషాలు స్క్రబ్ చేయండి. దీనిని కూడా వారానికి రెండు సార్లు అప్లై చేయవచ్చు

ఆలివ్ ఆయిల్​తో

కాఫీ పౌడర్​తో ఆలివ్ ఆయిల్​ కలిపి చర్మానికి అప్లై చేస్తే మీరు మెరిసే చర్మాన్ని పొందవచ్చు. స్కిన్​ మీద ఉండే మృతకణాలు తొలగించడంలో ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. దీనిని కూడా మీరు వారంలో రెండు మూడుసార్లు ఉపయోగించవచ్చు. 

తేనెతో కలిపి..

కాఫీలో తేనె కలిపి దీనిని శరీరానికి అప్లై చేస్తే పొడి చర్మం దూరమవుతుంది. అంతేకాకుండా చర్మానికి పూర్తి మాయిశ్చరైజర్​ అందుతుంది. దీనిని మీరు శరీరం మొత్తానికి అప్లై చేయవచ్చు. పావు గంట మీరు దానిని అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. 

కాఫీని మీరు పెరుగు, ఆల్మండ్ ఆయిల్, అవకాడో, జోజోబా ఆయిల్, షియా బటర్​ వంటి వాటితో కలిపి స్క్రబ్ చేయవచ్చు. ఈ పదార్థాలను కూడా మీరు కాఫీతో కలిపి స్క్రబ్ చేయవచ్చు. మీరు స్నానానికి రెండు నిమిషాల ముందు బాగా మసాజ్ చేసుకుని స్కిన్ బెనిఫిట్స్ పొందవచ్చు. మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. మంచి ఫలితాల కోసం మీరు వీటిని రెగ్యూలర్​గా ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు వీటిని ఉపయోగించుకునే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 

Also Read : ఈ మౌత్​ వాష్​లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget