అన్వేషించండి

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Winter Skin Care : చలికాలంలో చర్మం పొడిబారే సమస్య చాలా మందిలో ఉంటుంది. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ చర్మం హైడ్రెటెడ్​గా మారుతుంది.

Foods for Glowing Skin in Winter : చర్మం పొడిబారే సమస్య వింటర్​లో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దానిని సంరక్షించుకోవడం చాలా మంది బ్యూటీ కేర్ ప్రొడెక్ట్స్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా మాయిశ్చరైజర్స్​ వాడుతూనే ఉంటారు. అయితే మీరు చర్మ సంరక్షణకోసం ఇలాంటి కేర్ తీసుకోవడంలో తప్పులేదు కానీ.. చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేసేందుకు ఎక్కువగా శ్రద్ధ చూపాలి. 

పొడి చర్మం ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఎలాంటి పోషకాలు చర్మానికి అందించాలి? వేటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతామో గుర్తించాలి. ఆరోగ్యకరమైన చర్మం కోసం.. మీరు తీసుకునే ఆహారంలో పుష్కలంగా విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్స్ ఎ,సి,డి,ఈ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలి. ఇది మీ శరీరాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది అంటున్నారు నిపుణులు. చలికాలంలో చర్మం పొడిబారిన పడకుండా.. హెడ్రేట్​గా ఉంచే ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

చిలగడ దుంపలు

శీతాకాలంలో విరివిరిగా దొరికే ఫుడ్స్​లో చిలగడ దుంపలు ఒకటి. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. స్కిన్​కు అవసరమైన బీటాకెరోటిన్​ దీనిలో పుష్కలంగా ఉంటుంది. ఇది చలికాలంలో చర్మానికి జరిగే డ్యామేజ్​ను దూరం చేస్తుంది. కాబట్టి మీ డైలీ రోటీన్​లో చిలగడ దుంపలను కచ్చితంగా చేర్చుకోండి. 

అవకాడో..

అవకాడోలు క్రీమీగా, కాస్త వగరు వాసనతో ఉంటాయి. వీటిని బ్రెడ్​పై, టోస్ట్​పై అప్లై చేసి తీసుకోవచ్చు లేదా జ్యూసులు సలాడ్స్​లలో కూడా తీసుకోవచ్చు వీటిలోని అనామ్లజనకాలు, బీటా కెరోటిన్, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో మీ చర్మానికి అదనపు పోషణను అందిస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతాయి. 

బచ్చలి కూర

బచ్చలికూరలో ఐరన్, చర్మానికి అనుకూలమైన విటమిన్ ఈ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది విటమిన్లు, పోషకాలు, ఖనిజాలకు పవర్​హౌస్ అని చెప్పవచ్చు. దీనిలోని విటమిన్ ఎ, సి చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, హైడ్రేషన్​ గుణాలు చర్మానికి మరింత మెరుపును అందిస్తాయి. 

ఫిష్ 

చేపలు ఆరోగ్యానికి మంచివి. కొవ్వు కరిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే దీనిలోని ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి మంచి హెల్ప్ చేస్తాయి. చేపలలో ఉండే ఒమేగా 3 శరీరానికి అద్భుతాలు చేస్తుంది. అయితే చేపలను డీప్​ ఫ్రై చేయడం కంటే.. స్టీమింగ్, గ్రిల్లింగ్ లేదా బేకింగ్ చేస్తే మంచిది. ముఖ్యంగా సాల్మన్ చేప మీ చర్మ పోషణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. 

నట్స్

నట్స్, విత్తనాలు, గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికయ్యే డ్యామేజ్​ను తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిలోని విటమిన్ ఇ మీ శరీరాన్ని లోపలి నుంచి సంరక్షిస్తుంది. నట్స్​లోని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు చర్మకణాల నష్టాన్ని భర్తీ చేస్తాయి. అంతేకాకుండా చర్మకణాల పునరుత్పత్తిని ప్రోత్సాహిస్తాయి. తద్వార మీ చర్మం మరింత సున్నితంగా, మృదువుగా మారుతుంది. దీనికోసం మీరు బాదం, వాల్​నట్​లు, పొద్దుతిరుగుడు గింజలు ఓ గుప్పెడు తీసుకోవచ్చు. 

మనం తీసుకునే ఆహారమే ముఖంలో గ్లో తీసుకువస్తుంది. కాబట్టి కొన్ని ఆహార అలవాట్లు, చర్మానికి అవసరమైన పోషకాలు తీసుకోవడంపై దృష్టి సారిస్తే.. చలికాలంలో కూడా చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతమైన తేమతో నిగనిగలాడుతుంది. 

Also Read : పిల్లలకు చలికాలంలో నువ్వల చిక్కీ పెడితే ఎంతో మంచిది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget