Nuvvula Chikki Recipe : పిల్లలకు చలికాలంలో నువ్వల చిక్కీ పెడితే ఎంతో మంచిది
Nuvvula Chikki Making process : పిల్లలు చాక్లెట్స్ చాలా ఇష్టంగా తింటారు. అయితే చాక్లెట్ లాంటి టేస్ట్‌తో హెల్తీ స్నాక్ ఇవ్వాలనుకుంటే నువ్వల చిక్కీని తయారు చేసేయండి.
Nuvvula Chikki Reciep in Telugu : నువ్వులు, పంచదారతో నువ్వుల చిక్కీని తయారు చేస్తాము. అయితే ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కేవలం పిల్లలకోసమే కాదు.. పెద్దలకు కూడా ఓ హెల్తీ, టేస్టీ స్నాక్ అవుతుంది. ఇది అన్ హెల్తీ ఫుడ్ కోరికలను కంట్రోల్ చేస్తుంది. దీనిని బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ చక్కెరతో దీనిని చేసినప్పుడు.. ఇది కరకరలాడే క్రంచీ ఫీలింగ్ తీసుకువస్తుంది. పైగా దీనిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
నువ్వులు - 200 గ్రాములు
పంచదార - 500 గ్రాములు
నీరు - 1 కప్పు
బేకింగ్ సోడా - 1 టీస్పూన్
బేకింగ్ టిన్ - చిక్కీని సెట్ చేసేందుకు
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి దానిపై పెద్ద గిన్నె ఉంచండి. ఇప్పుడు దానిలో పంచదార, నీళ్లు వేయండి. ఇప్పుడు పాకం గట్టిగా అయ్యేవరకు ఉంచాలి. దీనిలో మీరు పంచదారకు ప్రత్యామ్నయంగా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది ఎలాంటి పాకమవ్వాలంటే.. చల్లటి నీటిలో వేస్తే గట్టి ముద్దలాగా తయారవ్వాలి. అది ముద్దగా అయితే వెంటనే దానిలో నువ్వులు వేయండి. మరో రెండు నిమిషాలు ఉడికించి.. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు దానిలో బేకింగ్ సోడా వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమాన్ని బేకింగ్ టిన్‌లో వేయాలి. అనంతరం దానిని బాగా సెట్ చేసి కట్ చేయాలి. అది గట్టిపడేవరకు అలా ఉంచేయండి. అనంతరం దానిని తీసి ముక్కలుగా చేసి.. స్టోర్ చేయవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా పిల్లలు, మహిళలకు ఈ స్నాక్ చాలా మంచిది. ఇది పిల్లల్లో వెన్ను బలాన్ని ప్రోత్సాహిస్తుంది. కేవలం ఈ నువ్వుల స్నాక్‌బార్ కాకుండా.. నువ్వుల లడ్డూలు కూడా తయారుచేసుకోవచ్చు. ఇవి ఇమ్మూనిటీని పెంచడంలో సహాయం చేస్తాయి.
మహిళలు పీరియడ్స్ సమయంలో నువ్వుల చిక్కీని తింటే ఎంతో మంచిది. ఇది బ్లడ్ పెరగడంలో హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించి ఉపశమనం ఇస్తుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మీ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి దీనిని రెగ్యూలర్‌గా తినొచ్చు. హెల్తీ స్నాక్స్ కోసం వెతికేవారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. ఈ సింపుల్ రెసిపీని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇప్పటి నుంచి పెద్దలవరకు అందరూ ఈ క్రంచీ స్నాక్స్ ఇష్టంగా తింటారు. ఎముకలను దృఢంగా చేయడంలో కూడా ఈ స్నాక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Also Read : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.