By: ABP Desam | Updated at : 19 May 2023 11:04 AM (IST)
Representational image/Pexels
కొన్ని రకాల స్నాక్స్, పండ్లు గడువు దాటిన తర్వాత తింటే స్టమక్ అప్ సెట్ కి కారణం కావచ్చు. కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు రావచ్చు. గడువు ముగిసిన కొన్ని రకాల పదార్థాలలో లిస్టేరియా, బ్రూసెల్లా, సాల్మోనెల్లా, ఇ. కోలి వంటి తీవ్రమైన బాక్టీరియాలు పెరగవచ్చు. ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు.
హామ్ వంటి ప్రాసెస్ చేసి ప్యాక్ చేసిన మాంసాహారాలు వాటి గడువు ముగిసిన తర్వాత వాటిని వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబతున్నారు. వీటిలో లిస్టేరియాతో సహా బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక గడువు తేది ముగిస్తే వీటిని అసలు వాడకూడదు.
పాలు, పాల పదార్థాలు, పెరుగు వంటి వాటిలో కూడా లిస్టేరియా మోనోసైటోజెన్స్ లాంటి ప్రమాదకర బ్యాక్టీరియా పెరగడం సులువు. కనుక ఇవి కూడా వాడకూడదు. డైటరీ కంటామినేషన్ చాలా తీవ్రమైన అనారోగ్యానికి కారణం కావచ్చు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, పసి పిల్లల వంటి నిరోధక వ్యవస్థ బలంగా లేని వారికి చాలా ప్రమాదకరం కావచ్చు. చీజ్, పన్నీర్ వంటి వాటని కూడా గడువు ముగిసిన తర్వాత అసలు వాడకూడదు.
పౌల్ట్రీ పచ్చిగా ఉన్నవైనా, లేదా వండినవైనా సరే గడువు ముగిస్తే వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాల్మోనెల్లా, ఈ.కోలి, కాంపిలో బాక్టర్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు పెరగవచ్చు. వీటిని ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే వాడాలి లేదా తిరిగి స్టోర్ చెయ్యాలనుకుంటే మాత్రం తప్పకుండా డబ్బాలో భద్ర పరచడం అవసరం. లేదంటే ఇవి త్వరగా పాడైపోతాయి. వాటిని తినడం వల్ల చాలా రకాల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది.
ముందుగా ప్యాక్ చేసి ఉంచిన సలాడ్ లు కూరగాయలు వంటి వాటిని కూడా గడువు దాటిన తర్వాత వాడకూడదు. ఇలాంటి ఆహారాల్లో త్వరగా బ్యాక్టీరియా డెవలప్ కావచ్చని న్యూట్రిషనిస్టులు అభిప్రాయపడుతున్నారు.
సమయం గడిచే కొద్దీ గుడ్డులో ఉండే క్యూటికల్ అనే ప్రొటెక్టివ్ బారియర్ తొలగి పోతుంది. సాల్మోనెల్లాతో సహా రకరకాల బ్యాక్టీరియాలు ఇందులో ఉత్పత్తయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గడువు ముగియక ముందే వీటిని ఉపయోగించాలి.
బేబీ ఫూడ్ వినియోగించే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గడువు దాటిన వాటిని అసలు ఉపయోగించకూడదు. గడువు ముగిసిన బేబి ఫూడ్ కంటామినేట్ అవడమొకటే కాదు అందులో పోషకాలు కూడా నశించవచ్చు.
గడువుతో పెద్దగా సంబంధం లేని అనేక పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన. అలాంటి వాటిలో డ్రైపాస్తా, బియ్యం పప్పుల వంటివి ఎంత కాలమైనా నిల్వ పెట్టుకోవచ్చు.
చెడ్దార్, పర్మేసన్ లేదా స్విస్ లాంటి చీజ్ ల వంటివి గడువులోగా వినియోగించేందుకు తయారు చేసినవని మరచిపోవద్దు. ప్యాకింగ్ మీద ఉన్న మార్గ దర్శకాలను తప్పకుండా పాటించడం కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఫుడ్ కంటామినేషన్ వల్ల కలిగే అనారోగ్యాలు నివారించేందుకు ఈ జాగ్రత్త్లు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. ఏమాత్రం అనుమానంగా ఉన్నా ఆ ఉత్పత్తిని వాడకపోవడమే మంచిదనేది వారి సలహా.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
Also read : 50 దాటాయా? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?
ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!
Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు
Heatstroke: సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే
Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!