అన్వేషించండి

50 దాటాయా? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

యాభైదాటిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మార్పులను అనుసరించి జీవన శైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి శరీరంలో చెప్పుకోదగిన మార్పులు జరగడాన్ని బహుశా, స్త్రీలందరూ కూడా గమనించే ఉంటారు. యాభై దాటగానే చిన్న చిన్న మార్సులు స్పష్టంగానే కనిపిస్తాయి. నిద్రలో మార్పు, హృదయ స్పందనలో మార్పు, జీర్ణ ప్రక్రియలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. అంతేకాదు హార్మోన్లలో మార్పులు, ఎముకలు బలహీన పడడం వంటి కనిపించని మార్పులు కూడా శరీరంలో జరుగుతాయి. అందుకే తప్పనిసరిగా ఈ వయసుకు రాగానే మహిళలు ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఆహారం

వయసును బట్టి శరీరానికి అవసరమయ్యే పోషకాల మోతాదు, శరీరం పోషకాలను గ్రహించే తీరు కూడా మారుతూ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. ఇలా సమతుల ఆహారం తీసుకుంటే రక్తనాళాలు, గుండె ఆరోగ్యం బావుటుంది. డయాబెటిస్ దరి చేరకుండా నివారించవచ్చు. వీలైనంత ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారానికి, చక్కెరకు దూరంగా ఉండాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

శ్రమించాలి

శరీరం ఫిట్ గా ఉండడంలో 60 శాతం ఆహారం మీద ఆధారపడి ఉంటే మిగతా 40 శాతం వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. రోజులో కనీసం 30 నిమిషాల వ్యాయమం అవసరం. దీన్ని అలవాటుగా మార్చుకోవడం చాలా అవసరం. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి కార్డియో ఎక్సర్సైజులు ఎంచుకోవాలి. యోగా, మెడిటేషన్ మానసిక ఆరోగ్యానికి, కూల్ గా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఆరోగ్య పరిస్థితిని అనుసరించి డాక్టర్ సలహాతో వ్యాయామం చెయ్యడం ప్రారంభించాలి.

విశ్రాంతి

వయసు పైబడే కొద్ది నిద్ర పోయే సమయం తగ్గుతుంటుంది. కానీ కావల్సినంత విశ్రాంతి అవసరముంటుందని మరచిపోవద్దు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉన్నవారు దీన్ని అదుపులో ఉంచుకోవాలి.

స్క్రీనింగ్ షుగర్, బీపీ, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్, ఆస్టియోపొరొసిస్, క్యాన్సర్ వంటి సమస్యలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. పైన చెప్పిన అన్ని జబ్బులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి చికిత్సలు అందుబాలో ఉన్నాయి. కనుక తరచుగా పరీక్షలు చేయించుకోవడం అవసరం.

కేవలం శారీరక మార్పులు మాత్రమే కాదు మానసిక మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది వరకు ఉన్నంత బీజీగా మీరు ఉండకపోవచ్చు కాస్త ఎక్కువ ఖాళీ సమయం దొరికే అవకాశం ఉంటుంది. కనుక కొత్త హాబీలు ఏర్పరుచుకోవడం, కొత్త స్నేహితులను ఏర్పరుచుకోవడం లేదా పాత స్నేహితులను తరచుగా కలుసుకోవడం కూడా జీవితంలో భాగం అని మరచిపోవద్దు. ఇవి జీవితానికి అందాన్ని, ఆనందాన్ని అద్దుతాయి. అందువల్ల మీరు మరింత ఉల్లాసంగా ఆనందంగా జీవితం గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. పనితీరికను బట్టి కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు సరదాగా చిన్నచిన్న ట్రిప్ లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకృతిలో సమయం గడపడం వల్ల రీచార్జ్ కావచ్చని మరచిపోవద్దు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget