News
News
X

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

అపరిశుభ్ర ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందనే విషయం తెలిసిందే. కానీ ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యేలా చేస్తుందని తెలుసా?

FOLLOW US: 
 
మనకి పడని ఆహారం లేదా నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఏదో ఒక సందర్భంలో అందరికి దీని బారిన పడి ఇబ్బంది పడుతూనే ఉంటారు. కడుపులో అసౌకర్యంగా ఉండటం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణ ఆరోగ్య సమస్య అయినప్పటికీ కొన్ని సార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే ఫుడ్ పాయిజనింగ్ దీర్ఘకాలిక గట్(జీర్ణనాళం) సమస్యలకి దారి తీస్తుంది. ఇన్ఫెక్షన్స్ బారిన పదే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఆందోళన పడకుండా తగిన సమయంలో చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడొచ్చు. కొన్ని ఆహార పదార్థాలు పరిశుభ్రంగా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అవేంటో చూద్దాం..

గొడ్డు మాంసం

తరచుగా  గొడ్డు మాంసాన్ని బర్గర్ లో ఉపయోగిస్తారు. ఇది బయట బ్యాక్టీరియాని కలిగి ఉంటుంది. ప్యాక్ చేసిన గొడ్డు మాంసం కంటే తాజాగా ఉన్న వాటినే తినేందుకు ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్లో నిల్వ చేయడం వల్ల అవి బ్యాక్టీరియాకి ఆవాసాలుగా మారతాయి. అందుకే వాటికి బదులుగా తాజా మాంసం ఎంచుకోవాలి.

సుషి

నిజానికి సుషి ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి. అయితే పచ్చి సుషి మాత్రం విషపూరిత ఆహారం. వీటిలో ఉండే బ్యాక్టీరియా, పరాన్నజీవులని చంపడానికి సుషిలను ఘనీభవించేలా చేస్తారు. అలా చేసిన వెంటనే వాటిని వండుకొని తినడం ఆరోగ్యానికి హానికరం. ఘనీభవించిన వెంటనే వాటిని వండుకోవడం వల్ల వాటిలోని బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. అది ఫుడ్ పాయిజనింగ్ కి దారి తీస్తుంది.

ఓస్టర్(Oysters)

ఓస్టర్ చేపలు చాలా మంది ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ప్రసిద్ధి చెందిన ఈ సీ ఫుడ్ ఆరోగ్యమకరమైన లైంగిక జీవితంతో ముడి పడి ఉంటుంది. గవ్వ లాంటి దాన్లో ఉండే ఈ చేప నీటిలో ఉండే బ్యాక్టీరియాను సులభంగా ఆకర్షించుకుంటాయి. వాటిని శుభ్రం చేసుకోకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

News Reels

బీన్స్ మొలకలు

మొలకలు ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శాఖాహారులు ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. కానీ ఇవి తినడం వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది.. బీన్స్ మొక్కలు వెచ్చని వాతావరణంలో పెరుగుతాయి. వాటిని వండుకోకుండా పచ్చిగానే తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే సూపర్ ఫుడ్ అయినప్పటికీ ఇది పుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది.

సలాడ్

అన్నీ రకాల పండ్లు, కూరగాయాలతో తయారు చేసే సలాడ్ అందరికి ఇష్టమైన ఫుడ్. కానీ దీని వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది అంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం. అయితే ముందుగా ప్యాక్ చేసిన సలాడ్ మాత్రమే అనారోగ్యకరం, విషపూరితం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం గత దశాబ్దంలో 22 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు సలాడ్‌ల కారణంగా వచ్చాయట. ముందుగా ప్యాక్ చేసి మూసి ఉన్న బ్యాగ్ లో వాటిని ఉంచడం వల్ల తేమగా ఉంటాయి. అవి తొందరగా బ్యాక్టీరియాని ఆకర్షిస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు

Published at : 03 Oct 2022 01:10 PM (IST) Tags: Avoid these foods Sea Food Salads Beans Food Poisoning Red Meat Sushi Food Poisoning Foods

సంబంధిత కథనాలు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు  కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!