అన్వేషించండి

Eyes: ఈ చిన్న చిన్న అలవాట్లే మీ కళ్లను దెబ్బతీస్తాయ్, జాగ్రత్త!

కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రోజూ మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు కళ్ళకి హాని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"సర్వేంద్రియానం నయనం ప్రధానం" అంటారు పెద్దలు. అన్ని ఇంద్రియాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి. కానీ వాటినే అందరూ నిర్లక్ష్యం చేస్తారు. స్క్రీన్ సమయం పెరగడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల కళ్ళకి అపారమైన నష్టం కలుగుతుంది. టీవీ, ల్యాప్ టాప్, మొబైల్ వంటి డిజిటల్ స్క్రీన్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అధిక సమయం స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు పొడి బారిపోవడం, ఒత్తిడి, తలనొప్పి, కళ్ళు మసకబారిపోవడం వంటివి ఎదుర్కుంటారు. ఇవే కాదు మెడ, భుజం నొప్పులు కూడా వస్తాయి. కొన్ని సార్లు వీటి వల్ల నిద్ర విధానం కూడా దెబ్బతింటుంది. ఏకాగ్రత మందగిస్తుంది. కళ్ళని రుద్దడం లేదా ఐ డ్రాప్స్ వంటి సాధారణ అలవాట్లు చెడు చేస్తాయి.

ఆయుర్వేద నిపుణురాలు రేఖా రాధామోనీ కళ్ళ విషయంలో ఈ తప్పులు చేయవద్దని అంటున్నారు. ఆరోగ్యవంతమైన కళ్ళని కాపాడుకోవడానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తప్పులు చేశారంటే కళ్ళు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

కళ్ళని గోరువెచ్చని నీళ్ళతో కడగటం: మనలో చాలా మంది గోరువెచ్చని నీటితో కళ్ళని కడుగుతుంటారు. కానీ ఇది అసలు మంచిది కాదు. కళ్ళు పిత్త దోషాన్ని పెంచుతాయి. అందుకే వాటిని గది ఉష్ణోగ్రత నీరు లేదా చల్లటి నీటితో కడగాలి.

కళ్ళు రెప్పవేయకుండా ఉండకూడదు: రెప్పవేయడం అనేది కంటి ఒత్తిడిని నివారించడానికి ప్రభావవంతంగా ఉన్న మార్గాల్లో ఒకటి. కళ్ళకి విశ్రాంతిని అందించడమే కాకుండా కళ్ళని లూబ్రికేట్ చేయడం ద్వారా పొడిబారకుండా చేస్తుంది. టాక్సిన్స్ శుభ్రపరుస్తుంది. మొబైల్ ఎక్కువగా చూస్తూ రెప్పవేయడం మర్చిపోతారు. కానీ తరచుగా రెప్ప వేయడం చాలా అవసరం.

ఐ డ్రాప్స్ వద్దు: కళ్ళు మంటగా అనిపించినా నొప్పులుగా ఉన్నా కొంతమంది తక్షణ ఉపశమనం కోసం ఐ డ్రాప్స్ ఉపయోగిస్తారు. అవి స్వల్పకాలంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో కళ్ళని మరింత పొడిగా మార్చేస్తాయి. దీర్ఘకాలం పాటు వేసుకునే కంటి మందులు ఎప్పుడు నూనె ఆధారితంగా ఉంటాయి. ఇవి కళ్ళకి మేలు చేస్తాయి.

నిద్రపోవడానికి ముందు కంటి మాస్క్ లు పెట్టుకోవడం: చాలా మంది చర్మ సంరక్షణలో భాగంగా కంటికి కూడా మాస్క్ లు పెట్టేసుకుని నిద్రపోతారు. హాట్ కంప్రెస్ ఐ మాస్క్ లు సౌకర్యంగా అనిపించినప్పటికి కళ్ళకి అది మంచిది కాదు. రాత్రిపూట కళ్ళు స్వేచ్చగా ఊపిరి పీల్చుకునేలా ఉంచుకోవాలి. ఇన్ఫెక్షన్లని నివారించేందుకు వేడిగా ఉండే ప్యాక్ కి బదులుగా కోల్డ్ ప్యాక్ వేసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణురాలు సూచిస్తున్నారు.

కళ్ళు పదే పదే రుద్దడం: చాలా మందికి ఉన్న అలవాటు. తరచూ కళ్ళు రుద్దడం కంటికి మంచిది కాదు. కళ్ళలోని సన్నని పొర వాటిని రక్షిస్తుంది. రుద్దటం వల్ల అది దెబ్బతింటుంది. రుద్దడానికి బదులుగా చల్లని నీటితో కళ్ళు కడగటం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: క్యాబేజీ తింటే బరువు తగ్గుతారా? ఆయుర్వేదం ఏం చెబుతోంది? ఏ వేళలో తింటే మంచిది?

టాప్ హెడ్ లైన్స్

Pregnancy and High BP : ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట
ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట
Matcha Tea : మాచా టీ ఎలా తయారు చేయాలి? రోజూ తాగితే మంచిదేనా? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
మాచా టీ ఎలా తయారు చేయాలి? రోజూ తాగితే మంచిదేనా? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Dengue or Viral Fever : జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Embed widget