Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే
మధుమేహ రోగులు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటూ అధికంగా ఉండడం వల్ల మధుమేహం వ్యాధి వస్తుంది. ఇది ఒకసారి వచ్చిందా జీవితాంతం వేధించే సమస్య. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నిద్ర, వ్యాయామం విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం చేశాక ఎవరికైనా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఓ గంటసేపు అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు అందుకే తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చక్కెర అధికంగా ఉండే ఆహారం తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మరింత పెరిగిపోతాయి. అందుకే ఆహారం విషయం జాగ్రత్తలు పాటించమని చెబుతారు. ప్రతి నెలా రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఎంత ఉండాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (12 గంటల పాటూ ఆహారం తినకుండా ఉన్నప్పుడు) స్థాయిలు 70 mg/dL నుంచి 100 mg/dL మధ్య ఉండాలి. అలా కాకుండా 100 mg/dL దాటి 125 mg/dL మధ్య ఉంటే ప్రీ డయాబెటిక్ అంటే జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ఇలా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పూర్తి డయాబెటిక్ గా మారిపోయే అవకాశం ఉంది. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయి 126 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్టు లెక్క. అంటే జీవితాంతం జాగ్రత్తలు పాటించాలి. మందులు తీసుకోవాలి.
ఇవి తినాలి...
చలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. అంటే ప్రత్యేకంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం, ఆహారం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వైద్యపరంగా ప్రభావితం చేస్తాయని నిరూపణ అయ్యింది. కాబట్టి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి రూట్ వెజిటేబుల్స్ చలికాలంలో తినాలని చెబుతున్నారు వైద్యులు. శాకాహారులు, మాంసాహారులు ఇరువురూ వీటిని తినాల్సిన అవసరం ఉంది. ముల్లంగి, ఉల్లిపాలయు, బీట్రూట్, క్యారెట్లు రోజువారీ డైట్లో ఉండాలి. వీటిని ఏదో విధంగా ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి.
Also read: పిల్లల్లోనూ అధిక రక్తపోటు ఆనవాళ్లు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.