అన్వేషించండి

Acidity: గ్యాస్, ఎసిడిటీ నుంచి రక్షించే ఆహారాలు ఇవే

Acidity: కొన్ని రకాల ఆహారాలు అజీర్తి, గ్యాస్‌ను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి.

Acidity: అతిగా తినడం లేదా సరిగా ఉడకని ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటివి వచ్చే అవకాశం ఉంది. అధిక ఆహారం తినడం, సమయానికి తినకపోవడం వంటివి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాంటి సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు అజీర్తితో బాధపడితే మలబద్ధకం, మొలలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి.

అజీర్తితో బాధపడుతున్నప్పుడు ఇంట్లో బొప్పాయి పండు ఉంటే వెంటనే ఆ బొప్పాయి పండును తినాలి. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా అవసరమైనది. బొప్పాయిలో పీచు, నీరు అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతాయి. దీని వల్ల అజీర్తి, కడుపునొప్పి, మలబద్ధకం వంటివి తగ్గే అవకాశం ఉంది.

ప్రతి ఇంట్లో అల్లం ఉంటుంది. వికారం, అజీర్తి  అధికంగా వేధిస్తున్నప్పుడు వెంటనే అల్లం టీ తయారు చేసుకుని తాగండి. నీళ్లలో అల్లం తురుమును వేసి బాగా మరిగించి వడకట్టుకొని ఆ నీటిని తాగడమే. లేదా ఎండబెట్టిన అల్లం పొడిని నోట్లో వేసుకున్న చాలు, కొంతసేపటికి ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సి, సహజ చక్కెర్లు అధికంగా ఉంటాయి. కడుపునొప్పి, వికారం వేధిస్తున్నప్పుడు వెంటనే కొబ్బరి నీళ్లు తాగేందుకు ప్రయత్నించండి. ఇది అజీర్తిని, వికారాన్ని తగ్గిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. నీరసం తగ్గుతుంది. కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు వెంటనే ఒక అరటిపండును తినేయండి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు, శరీరంలో నీటి శాతం తగ్గినట్టు అనిపించినా, అతిగా ఆందోళనగా అనిపిస్తున్నా వెంటనే అరటిపండును తింటే మంచిది. అలాగే గ్రీన్ టీ తాగినా కూడా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్రీన్ టీ లో కడుపుబ్బరాన్ని తగ్గించే లక్షణాలు ఉంటాయి. దీనిలో ఉండే యాక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. అలాగే వామును, రాక్ సాల్ట్ తో నీళ్లలో కలిపి తాగేసినా కూడా అజీర్తి సమస్య తగ్గుతుంది. ఎందుకంటే వాములో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఉప్పుతో కలిపి తీసుకున్నప్పుడు అజీర్తి వంటివి నయమవుతాయి. అజీర్తి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడితే ఇంచా మంచిది.

Also read: డయాబెటిస్ రోగులు కచ్చితంగా తినాల్సిన పండ్ల జాబితా ఇదే

Also read: ఎండు కొబ్బరిని తింటే ఈ సమస్యలన్నీ దూరం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget