అన్వేషించండి

Dry coconut: ఎండు కొబ్బరిని తింటే ఈ సమస్యలన్నీ దూరం

Dry coconut: ఎండు కొబ్బరిని చాలామంది దూరం పెడతారు. దీన్ని తినాల్సిన అవసరం ఉంది.

Dry coconut: ఎండు కొబ్బరి కూడా ఒక రకమైన డ్రై ఫ్రూటే. బాదం, పిస్తా, అంజీర్, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. కానీ ఎండు కొబ్బరిని డ్రై ఫ్రూట్ అని భావించరు. నిజానికి  ఎండు కొబ్బరి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే డ్రైఫ్రూటే. దీన్ని ప్రతి వంటకంలో భాగం చేసుకోవచ్చు. కూరలో, బిర్యానీలో వేసి వండుకోవచ్చు. ఈ ఎండుకొబ్బరి మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. కొబ్బరి నీళ్లు, పచ్చి కొబ్బరి... రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఎండు కొబ్బరి కూడా మనకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఎంత ఆరోగ్యమో, ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్కని తిన్నా కూడా అంతే ఆరోగ్యం. కాకపోతే ఎండు కొబ్బరి గట్టిగా ఉంటుంది. నమలడానికి కష్టం. కాబట్టి వంటల్లో భాగం చేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. దీనిలో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, కాపర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

ఎండు కొబ్బరిని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడులో మైలీన్ అని అనే సమ్మేళనం ఉత్పత్తికి ఎండుకొబ్బరి సహాయపడుతుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. మెదడులోని నరాలపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఎండుకొబ్బరి సహాయపడుతుంది. దీనివల్ల పక్షవాతం వంటివి రాకుండా ఉంటాయి. ఎంతో మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు ఎండు కొబ్బరిని తినడం వల్ల అనీమియా రాకుండా ఉంటుంది. ఎండు కొబ్బరి వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని బెల్లంతో కలిపి తింటే ఇంకా మంచిది. ఎవరైతే కీళ్లనొప్పులతో బాధపడుతున్నారో వారు ప్రతిరోజు ఎండుకొబ్బరిని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎముకలు పెళుసు బారడం అంటే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. అల్సర్లతో  బాధపడుతున్న వారి ఎండు కొబ్బరిని తినడం అలవాటు చేసుకోవాలి.

ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను కాపాడతాయి. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు రాకుండా చూసుకుంటాయి. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది. గుండెపోటు వంటివి రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తింటే మంచిది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే శక్తి ఎండుకొబ్బరి కి ఉంది. కాబట్టి గుండె జబ్బున బారినపడిన వారు ఎండుకొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

Also  read: ఎక్కువ స్క్రీన్ టైమ్ మీ పిల్లల ఆలోచనా శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Embed widget