News
News
X

Diabetes: మధుమేహానికి మెంతులను మించిన పరమౌషధం మరొకటి లేదు

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే మెంతులను రోజు తినాలి రెండు వారాల్లో మీకు ఉత్తమ ఫలితం కనిపిస్తుంది

FOLLOW US: 
Share:

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారందరూ నోరు కట్టుకొని జీవంచాల్సి వస్తుంది. ఏం తిన్నా కూడా ఏం జరుగుతుందోనని భయం. రక్తంలో షుగర్ పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. డయాబెటిస్ పెరిగిపోతే మొదట కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. అందుకే మధుమేహం ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో అప్రమత్తతతో ఉండాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచే సులువైన చిట్కా మెంతులు. మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మీరు తినే ఆహారంలో మెంతుల్ని రోజు ఉండేలా చూసుకోండి. లేదా రోజు పరగడుపున మెంతుల పొడిని నీటిలో కలుపుకొని, గంట పాటు నానబెట్టి వాటిని తాగితే, నెల రోజుల్లో మధుమేహం అదుపులోకి వచ్చేస్తుంది. రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం లేచి ఆ నీళ్లను తాగినా మంచిదే. లేదా మెంతుల పొడిని రాత్రి నీళ్లలో నానబెట్టి,ఉదయం లేచి ఆ పొడి తో సహా తాగినా ఎంతో మేలు.  ఎలా చేసిన మెంతులు పొట్టలోకి వెళ్లడం ముఖ్యం. ఇలా పరగడుపున మెంతులు పొట్టలోకి వెళ్లడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, రాగి, విటమిన్ ఏ, బి, సి, కె, క్యాల్షియం, ఐరన్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి మనిషికి అవసరం. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ పోషకాలాన్నీ శరీరంలో చేరడం అత్యవసరం. ముఖ్యంగా గర్భిణీలు మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే, పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపాలు లేకుండా పుడుతుంది. మెంతుల పొడిని చేసి రెడీగా పెట్టుకుంటే కూరల్లో, వంటల్లో, చపాతీల్లో వండినప్పుడు కలిపేయొచ్చు. అలా మనకు తెలియకుండానే చాలా వరకు మెంతులు మన శరీరంలోకి చేరుతాయి.

ఇన్సులిన్ ను ప్రేరేపించే గుణంగల అణువులు మెంతుల్లో అధికంగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్‌ను అదుపులో ఉంచడానికి చాలా సహకరిస్తాయి. అలాగే ఈ గింజల్లో 4హైడ్రాక్సిస్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, మన శరీర కణాలు ఆ ఇన్సులిన్‌ను గ్రహించేలా చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బంది లేకుండా మెంతులు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. అలాగే మనం తినే ఆహారంలో ఉన్న పిండి పదార్థాలను శరీరం వెంటనే గ్రహించుకోకుండా నెమ్మదింపజేసి, రక్తంలో గ్లూకోజులు పెరగకుండా చూస్తాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి తన ఇచ్చిన నివేదికలో మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి మెంతులకు ఉన్నట్టు ఇప్పటికే తేల్చింది. మెంతుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్నే కరిగే పీచు పదార్థమని అంటారు. ఇది మధుమేహులకు చాలా మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య కూడా రాకుండా అడ్డుకుంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా మెంతులు సహకరిస్తాయి. మెంతుల్లో సోపోనిన్స్ ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అప్పుడప్పుడు మెంతులతో టీ కాచుకొని తాగిన చాలా మేలు జరుగుతుంది. 

Also read: ఇంజక్షన్లంటే భయపడే వారికి శుభవార్త, భవిష్యత్తులో కోవిడ్ వ్యాక్సిన్లను తాగేయొచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 26 Jan 2023 11:19 AM (IST) Tags: Diabetes Diabetes food Fenugreek Diabetes Diabetes remedies

సంబంధిత కథనాలు

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి

Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి

Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే

Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

CBI Case Avinash Reddy :  సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao :  వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?