By: Haritha | Updated at : 26 Jan 2023 11:21 AM (IST)
(Image credit: Pixabay)
చాలామందికి ఇంజక్షన్లు అంటే భయం ఉంటుంది. సూది మందులంటే పరుగులు పెడతారు. అందుకే కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి గతంలో భయపడ్డారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక శుభవార్త. భవిష్యత్తులో ఇంజక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్‌కి బదులు సిరప్ రూపంలో తాగేసే వ్యాక్సిన్లు రాబోతున్నాయి.ఒక్కో డోసుకి చుక్కల రూపంలో ఈ ద్రవ వ్యాక్సిన్ ను వేస్తారు. ప్రస్తుతం ఈ ద్రవవ్యాక్సిన్ పై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ ద్రవ వ్యాక్సిన్‌కు QYNDR అని పేరు పెట్టారు.దీన్ని షార్ట్ కట్‌లో కిండర్ అని పిలుస్తారు. ఈ పరిశోధనలో మొదటి దశ పూర్తయింది. క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. దీన్ని మార్కెట్‌కు తీసుకురావాలంటే మరింత వివరణాత్మకంగా, అధునాతక ట్రయల్స్ నిర్వహించాలి. దానికి కావాల్సిన నిధుల కోసం ప్రస్తుతం వెతుకులాట సాగుతోంది. ఈ వ్యాక్సిన్ ను అమెరికాకు చెందిన స్పెషాలిటీ ఫార్ములేషన్స్ సంస్థ తయారు చేస్తుంది. వీటిలో ముక్కులో వేసే వ్యాక్సిన్లు, నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు. కొన్ని చుక్కల వ్యాక్సిన్‌ను ముక్కులో వేయడం ద్వారా లేదా కొన్ని చుక్కలు నోట్లో వేయడం ద్వారా ఈ వ్యాక్సిన్ డోసులను తీసుకోవచ్చు. దాదాపు పోలియో వ్యాక్సిన్‌లాగే ఇది కూడా ఉంటుంది.
మొదట్లో కొంతమంది సూదిమందులకు భయపడి చెట్టెక్కి ఉండిపోవడం, పారిపోవడం వంటి సందర్భాలు చూసాం. అలాంటి వారి కోసమే ఇలా ముక్కు ద్వారా, నోటి ద్వారా వేసే చుక్కల మందు కోవిడ్ వ్యాక్సిన్‌ను కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఇంజక్షన్ ద్వారా ఇచ్చే కోవిడ్ వాక్సిన్ రక్తంలో కలుస్తుంది, కానీ ముక్,కు నోటి ద్వారా వేసేది మాత్రం జీర్ణవ్యవస్థలోకి వెళ్తాయి. అక్కడి నుంచి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇలా జీర్ణ వ్యవస్థలోకి వెళ్లిన వ్యాక్సిన్ అనేక ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా ఇంకా ఈ ప్రపంచం నుంచి పోలేదు. భవిష్యత్తులో కూడా ఫ్లూ లాగే, ఇది కూడా శాశ్వతంగా ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఇలా చుక్కల మందులను తయారు చేసే పనిలో పడ్డాయి మందుల తయారీ సంస్థలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 850 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 6.6 మిలియన్లకు పైగా రోగులు మరణించారు. ఇప్పటికీ ఇంకా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో అవి ఎలా ఉంటాయో ఏ మేరకు తీవ్రంగా పనిచేస్తాయో తెలియదు, అందుకే ఇంకా కరోనా కోసం మందుల ఆవిష్కరణ జరుగుతూనే ఉంది.
Also read: ఈ ఆహారాలను రోజూ తింటే మీరు త్వరగా ముసలివాళ్లు కారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త
Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి
ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్