News
News
X

మైండ్ ఇట్ - ఈ అలవాట్లను మార్చుకోకపోతే మెదడు మటాషే!

శరీరంలోని ప్రతి పనిని నియంత్రించేది మెదడే. కానీ అది కనిపించదు, దానికి జరిగే నష్టం అంత త్వరగా గుర్తించలేము కనుక మెదడు ఆరోగ్యం గురించి పెద్ద శ్రద్ధ తీసుకోము.

FOLLOW US: 
Share:

న శరీరంలో అంత్యంత సంక్లిష్టమైన అవయవం మెదడు. శరీరంలోని ప్రతి పనిని నియంత్రించేది మెదడే. కానీ, మనకు అదేదీ కనిపించదు. మన కాళ్లు, చేతులు, ఆలోచనలు అన్నీ దాని ఆదేశాలతోనే పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తించలేం. జ్ఞానానికి, జ్ఞాపకశక్తికి, వయసుకు తగినట్టు జీవించడం అన్నీ మెదడు పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. అయితే, మెదడు లోపల ఏం జరుగుతుంది? ఎలా నష్టం జరుగుతుందనేది కూడా మనం అంత ఈజీగా అంచనా వేయలేం. దానివల్ల మనలో చాలామంది మెదడును సేఫ్‌గా ఉంచుకొనే ప్రయత్నాలేవీ చేయరు. 

మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మన రోజువారి చర్యలు కొన్ని మనకు తెలియకుండానే మెదడు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ప్రస్తుతం మనం బ్రెయన్ ట్యూమర్ అవేర్నేస్ మంత్ లో ఉన్నాం. ఈ సందర్భంగా మెదడు, దానికి జరిగే నష్టాన్ని గురించి తెలుసుకుందాం. 

కొన్ని చిన్నచిన్న అలవాట్లు మార్చుకోక పోతే జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెయిలీ ఆక్టివిటీ తక్కువగా ఉంటే మెదడు క్రమంగా దాని సామర్థ్యాన్ని కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వర్కవుట్

రోజుకు కనీసం 30 నిమిషాల పాటు లైట్ టూ మోడరేట్ వర్కవుట్ తప్పనిసరిగా చెయ్యాలని అంటున్నారు. అది వాకింగ్ అయితే మరీ మంచిది. 15 నిమిషాల పాటు కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో తర్వాత మోడరేట్ గా నడవడం వల్ల మెదడు పనితీరు చురుకుగా ఉండడమే కాదు.. ఓవరాల్ హెల్త్ కూడా మెరుగ్గా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేసిన ప్రతిసారీ కొత్తగా మెదడు కణాలు అభివృద్ధి చెందుతాయి. కనుక తప్పనిసరిగా యాక్టివిటీలో ఉండాలి అని తెలిపారు. చురుకుగా ఉండడం వల్ల హార్ట్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. రక్తప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. మెదడుకు మరింత ఆక్సిజన్ అందుతుంది. ఈపరిణామాలు హార్మోన్ల విడుదలకు, మెదడు కణాల పెరుగుదల వృద్దికి తోడ్పడుతాయి. మెదడు ఆరోగ్యానికి వారానికి ఒకసారి ఎరోబిక్స్ ఇంకా స్ట్రెంత్ ట్రెయినింగ్ వ్యాయామాలు చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

స్వీట్లు, జంక్ వద్దు

అల్ట్రా ప్రాసెస్డ్ ఫూడ్, అధిక చక్కెర, కొవ్వు కలిగిన ఆహారం, మెదడు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయట. కేకులు, బిస్కట్లు, ఫిజీ డ్రింక్స్ వంటి ఆహారాలు, ప్రీప్యాక్డ్ మీల్స్ వంటి వాటికి దూరంగా ఉండడం అవసరం. వీటిలో ఎక్కువగా ఉండే ఉప్పు వల్ల బీపీ పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో సైకలాజికల్ సమస్యలు పెంచుతుంది.

ఒంటరి తనం

ఎక్కువ కాలం పాటు ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండడం, దీర్ఘకాలిక ఒంటరి తనం మెదడు ఆరోగ్యం మీద చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒంటరితనం న్యూరల్ ప్లాస్టిసిటికి మంచిదికాదు. ఇతరులతో ఇంటరాక్షన్ లేకపోతే కొత్త స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఒంటరితనం ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్నే చూపుతుందని నిపుణులు అంటున్నారు. 

మల్టీ టాస్కింగ్

చాలా రకాల పనుల్లో తీరికలేకుండా ఉండడం వల్ల దేనిమీదా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారని అనిపిస్తుందా? దీర్ఘకాలం పాటు మల్టీటాస్కింగ్ చేసే వారిలో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కలుగుతాయని బురియానోవా అంటున్నారు. ఇవన్నీ కూడా మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తాయట. కనుక తొందరేమీ లేదు. కూల్ గా పనులు చక్కబెట్టుకోవాలని నిపుణుల సలహా.

Also Read: జుట్టు రాలిపోతుందా? గోర్లు విరిగిపోతున్నాయా? కారణాలు ఇవే!

Published at : 09 Mar 2023 03:50 PM (IST) Tags: Brain Health Brain diseases Brain Problems Brain Brain Health Tips

సంబంధిత కథనాలు

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి