By: ABP Desam | Updated at : 30 Nov 2022 06:19 PM (IST)
Edited By: Bhavani
Representational Image/Pexels
రాత్రిపూట చెమటలు పడుతున్నాయా? వాతావరణం చల్లగా ఉన్నా సరే, ఉడుకుగా ఉన్నట్లు అనిపిస్తోందా? అయితే, మీరు హెల్త్ టెస్ట్ చేయించుకోవాడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. రాత్రివేళలు పట్టే చెమట.. వివిధ క్యాన్సర్లకు సంకేతం.
కార్సినాయిడ్ క్యాన్సర్లు, లుకేమియా, లింఫోమా, బోన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, మీసోథెలియోమా వంటి క్యాన్సర్ బాధితుల్లో రాత్రిపూట చెమటలు పట్టే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. ‘చెమట’ అనేది శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరిచేందుకు శరీరంలో సహజంగా చోటుచేసుకొనే కూలింగ్ ప్రక్రియ. ఇది ప్రతి ఒక్కరికి ప్రతి రోజూ నిరంతరం జరిగేదే. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులతో శరీరం పోరాడుతున్నపుడు.. రాత్రి పూట హాట్ ఫ్లషెస్ మాదిరిగా కాసేపు ఎక్కువ వేడిని అనుభవిస్తారు. శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. అయితే క్యాన్సర్లలో ఇలా జరగడానికి కారణాలను ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించలేదు. ఇది క్యాన్సర్ తో శరీరం చేసే పోరాటంలో భాగమేమో అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదా క్యాన్సర్ వల్ల హార్మోన్లలో వచ్చిన మార్పులు కావచ్చేమో అని హెల్త్ లైన్ నిపుణులు అంటున్నారు.
అన్ ఎక్స్ ప్లేయిన్డ్ నొప్పి ఉంటుంది. సహజంగానే వయసు పెరిగే కొద్దీ నొప్పి భరించే శక్తి సన్నగిల్లుతుంది. నొప్పి ఎందుకు? ఎక్కడో చెప్పటం వీలు కానీ సమయంలో ఏదో జరగకూడనిది జరుగుతోందని గుర్తించాలని క్యాన్సర్ పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా బరువులో చిన్నచిన్న మార్పులు సహజమే. కానీ ఎలాంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గుతూ పోతున్నారంటే అది నిపుణుల దృష్టికి తేవాల్సిన విషయమని గుర్తించాలి. ఇది అన్నవాహిక, జీర్ణాశయం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ల వల్ల కావచ్చు అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అభిప్రాయపడుతోంది.
శరీరంలోని ఏ భాగంలో నైనా కణితులు ఏర్పడడం, లేదా వాపు రావడం జరిగితే కచ్చింతంగా ఒకసారి వైద్య సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా బాహుమూలలు, పొట్ట, ఛాతి, రొమ్ము, వృషణాల్లో వచ్చే వాపు ను కానీ కణితి ని కానీ అసలు నిర్లక్ష్యం చెయ్య కూడదు.
తగినంత పోషణ లేకపోవడం, పని ఒత్తిడి, నిద్ర లేమి వల్ల అలసటగా ఉండొచ్చు. కానీ స్పష్టమైన కారణం లేకుండానే తరచుగా అలసి పోతుంటే మాత్రం కీడు శంకించాల్సిందే. లుకేమియా, లింఫోమా, మల్టీపుల్ మైలోమా వంటి రక్తానికి సంబంధించిన క్యాన్సర్ల లక్షణం కూడా అయి ఉండవచ్చు. ఈ క్యాన్సర్లు బోన్ మారో లో ప్రారంభం అవుతాయి కనుక ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గి ఆక్సిజన్ తగినంత అందక పోవడం వల్ల ఇలా నీరసించి పోతారు.
మొటిమ లేదా పుట్టుమచ్చవంటిది లేదా ఏదైనా పుండు నయం కాకపోయినా నొప్పి లేకుండా ఉన్నా సరే కచ్చితంగా దాన్ని డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. కొత్తగా పుట్టు మచ్చలు ఏర్పడడం లేదా ఇప్పటికే ఉన్న పుట్టు మచ్చులయినా సరే పరిమాణం, ఆకారంలో లేదా దురద గా ఉండడం లేదా రక్తం రావడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండానే ఇతర ఏకారణం లేకుండానే మింగడానికి ఇబ్బందిగా ఉంటే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. మింగడంలో కష్టం అంటే అన్నవాహిక క్యాన్సర్ కావచ్చు.
అకారణంగా అసిడిటీ, గుండెల్లో మంట, ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం వంటి లక్షణాలు కొన్ని సార్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రారంభంలో కనిపిస్తాయి. కనుక నిర్లక్ష్యం తగదు.
Also read: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Water for Hydration: శరీరం డీహైడ్రేట్కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి
Prediabetes: ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఏం తినాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?
బరువు తగ్గేందుకు అతిగా వ్యాయామం చేస్తున్నారా? అస్సలు వద్దు, బెస్ట్ వర్కవుట్ ఇదే!
Millets: ఆహారాలకే అమ్మలాంటివి చిరుధాన్యాలు - వీటిని మెనూలో చేర్చుకుంటే ఎంత ఆరోగ్యమో
Air Fryer: ఎయిర్ ఫ్రైయర్లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?
Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
Budget 2023: ఇన్కం టాక్స్లో మోదీ సర్కార్ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!
Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్లు - రైల్వే మంత్రి ప్రకటన