అన్వేషించండి

Basic Principles of Happy Living: సంతోష‌క‌ర‌మైన జీవితానికి ప‌ది మార్గాలు - ఇవి పాటిస్తే.. మీ లైఫ్ స్వర్గసీమే!

జీవితంలో క‌ష్ట‌సుఖాలు అనేవి ప‌గ‌లు రాత్రి లాంటివి. రోజంతా చీక‌టే ఉండ‌దు, రోజంతా వెలుగే ఉండ‌దు. చీక‌ట్లో దీపం వెలిగించి వెలుగును ఎలా పొందుతామో, అలాగే తెలివితేట‌ల‌తో క‌ష్టాల‌ను అధిగ‌మించాలి. 

Ten Basic Principles of Happy Living : జీవితంలో సంతోషంగా ఉండాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారు. కానీ, నిత్యం ఏదో ఒక స‌మ‌స్య మ‌నల్ని వేధిస్తుంటుంది. స‌మ‌స్య‌లు లేని మ‌నిషి జీవితం మాత్రం ఉండ‌ద‌నేది ఎంత స‌త్య‌మో.. స‌మ‌స్య‌లు జీవితాంతం కూడా ఉండ‌వ‌నేది కూడా అంతే స‌త్యం. స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేలా మ‌న‌ల్ని మ‌నం మ‌లుచుకోవాలి. క‌ష్టాల‌ను త‌రిమేసే శ‌క్తిని మ‌న‌లో నింపుకోవాలి. మార్పును స్వీక‌రించి అవ‌కాశాల‌ను సృష్టించుకోవాలి. మ‌న శ‌క్తి సామ‌ర్థ్యాల‌పై ముందుగా మ‌నకొక క్లారిటీ ఉండాలి. త‌ద్వారా ఏం చేయ‌గ‌లం, ఏం చేయ‌లేమో అనేది స్ఫ‌ష్టత వ‌స్తుంది. జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవడానికి 10 మార్గాలు. వాటిని అనుస‌రిస్తే క‌ష్టాల్లోనూ న‌వ్వుతూ బ‌తికేయ‌చ్చ‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.  

1. జీవితంలోని అన్ని అంశాలు: స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డానికి, స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు మ‌నల్ని మ‌నం సిద్ధం చేసుకోవాలి. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుంటే స‌వాళ్ల‌కు ఎదురు నిల‌బ‌డే శ‌క్తి వ‌స్తుంది. అది వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మైన అభివృద్ధికి దోహ‌దం చేస్తుంది. 

2. అపజయాలే విజయానికి సోపానం: వైఫల్యం నుంచి నేర్చుకుంటూ పోతే విజ‌యాల‌కు నిచ్చెన‌మెట్లుగా మారుతాయి. విజ‌యాన్ని అందుకోవాల‌న్న కృషి, ప‌ట్టుద‌ల అద‌న‌పు శ‌క్తినిస్తుంది. 

3. కృతజ్ఞతాభావం ఆనందాన్ని పెంపొందిస్తుంది: కృతజ్ఞతాభావంతో మెల‌గ‌డం వ‌ల్ల సానుకూల మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది మ‌న చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణాన్నిఆనంద‌మ‌యంగా మార్చి మాన‌సిక ప్ర‌శాంత‌త‌కు కార‌ణం అవుతుంది. 

4. మ‌న‌సుతో ఆలోచించ‌డం జీవన నాణ్యతను పెంచుతుంది: ఈ క్షణం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎలా ఉండ‌కూడ‌దో తెలిసుండాలి. మ‌న‌సుతో ఆలోచించే ల‌క్ష‌ణాన్ని అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల‌న అంశాల‌పై మ‌రింత‌ స్పష్టత, ఆలోచించే దృష్టి కోణం మారి మొత్తం జీవిత సంతృప్తికి దోహదం చేస్తాయి.

5. వ్యక్తిగత బాధ్యత వృద్ధికి శక్తినిస్తుంది: తోటి వ్య‌క్తుల ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని మ‌స‌లుకోవ‌డం, అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆ బాధ్య‌త‌ల‌ను మ‌నమే స్వీక‌రించ‌డం ద్వారా ఆ వ్య‌క్తుల జీవితాల్లో సానుకూల మార్పును సృష్టిస్తుంది. ఇది నీ వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంది.

6. నిరంతర అభ్యాసం చాలా ముఖ్యం: జీవితకాలం నేర్చుకునే విద్యార్థిగానే ఉండాలి. విష‌య ప‌రిజ్ఞానం పెంచుకోవాల‌న్న జిజ్ఞాస ప్ర‌తి మ‌నిషి వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొత్త కొత్త అవకాశాల‌కు, అనుభవాలకు దారి చూపిస్తుంది. 

7. ప్రేమ అత్యంత బ‌ల‌మైన శక్తి: ప్రేమ ఈ ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన శ‌క్తి. మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకోవ‌డం. తోటి వారిని ప్రేమించ‌డం, ఔదార్యంతో ఉండ‌టం లాంటివన్నీ జీవితంలో ఆనందాన్ని పంచుతాయి. నీ ప‌ట్ల ఇత‌రుల‌కు స‌దాభిప్రాయాన్ని క‌ల‌గ‌జేస్తాయి. 

8. స్వీయ-అవగాహన వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది: మ‌న బలాలు, బలహీనతల‌పై మ‌న‌కు స్ప‌ష్ట‌త ఉండాలి. మ‌న కోరిక‌ల‌ను నియంత్ర‌ణ చేసుకునే సామ‌ర్థ్యం పంచుకోవాలి. తనను తాను అర్థం చేసుకోగ‌లిగిన‌వాడు స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డంలో ముందుంటాడు. 

9. మార్పును స్వీకరించడం వృద్ధికి అవసరం: మార్పు అనివార్యం. దానిని అంగీకరించక త‌ప్ప‌దు. ఇది వ్య‌క్తిగ‌త అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌టంతోపాటు అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. 

10. స‌మాజం ప‌ట్ల దయ, సానుభూతి క‌లిగి ఉండాలి: ఇతరుల ప‌ట్ల‌ కనికరం చూప‌డం, వారి స‌మ‌స్య‌ల ప‌ట్ల అవగాహనతో వ్యవహరించడం మాన‌వ సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా మరింత సామరస్యపూర్వకమైన ప్రపంచ నిర్మాణానికి దోహ‌దం చేస్తుంది. 

Also Read : హస్తప్రయోగం ఎక్కువగా చేస్తే ఆ సమస్యలు తప్పవట.. అపోహలు, వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget