By: Haritha | Updated at : 01 Feb 2023 08:35 AM (IST)
(Image credit: Instagram)
ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల ఆరోగ్యపరంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఏకాగ్రతా శక్తిని పెంచుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. తెలివితేటలను, దృశ్య సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే ఎక్కువమంది ఆప్టికల్ ఇల్యూషన్లను ఇష్టపడతారు. ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ అలాంటిదే. ప్రసిద్ధ చిత్రకారుడు జాక్‌పాట్ జాయ్ రూపొందించిన చిత్రం ఇది. ఇందులో 12 జంతువులు ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూడగానే మీకు ఏ జంతువు మొదట కనిపిస్తుందో, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి.
సింహం
మీకు మొదట సింహం ముఖం కనిపించి ఉంటే, మీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్న వారని అర్థం. మిమ్మల్ని ఇతరులు నమ్మవచ్చు. ప్రతిష్టకు, పరువుకు చాలా విలువనిచ్చేవారు మీరు.
పిల్లి
చిత్రంలో పిల్లిని మొదట మీ మెదడు గుర్తించినట్లయితే, మీరు జీవితంలో కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఇష్టపడతారు. పెద్దగా మాట్లాడరు. అంతర్ముఖులుగా ఉంటారు. నిర్ణయాలు మీకు మీరే తీసుకుంటారు.
తిమింగలం
సముద్ర జీవి అయిన తిమింగలాన్ని మొదట గుర్తించినట్లయితే... మీరు మెదడు నుంచి కాకుండా మనసు నుంచి ఆలోచిస్తారు. మీ ఇష్టాలకు ఎక్కువ విలువని ఇస్తారు. ఇతరులతో సంబంధం బాంధవ్యాలను కలిగి ఉంటారు.
తోడేలు
తోడేలును మొదట గుర్తించిన వ్యక్తులు రహస్యాలను అధికంగా దాస్తారు. వారిని వారు ఉన్నతంగా చూసుకోవాలని కోరుకుంటారు. వారి అంచనాలన్నీ అవాస్తవంగానే ఉంటాయి.
గుడ్లగూబ
గుడ్లగూబను మొదట చూసినట్లయితే మీరు తెలివైన వ్యక్తులని చెప్పుకోవచ్చు. అలాగే సున్నిత మనస్కులు అని కూడా అంచనా వేయచ్చు. మీకు శ్రద్ధ అధికంగా ఉంటుంది. ఏదైనా అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
గుర్రం
అతి వేగంతో దౌడు తీసే గుర్రాన్ని మొదట గుర్తించినట్లయితే మీరు సాహసోపేత వ్యక్తి అని చెప్పవచ్చు. అలాగే స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు.
నక్క
నక్కను ఎక్కువగా ప్రతికూల సందర్భాల్లోనే తలుచుకుంటాం, కానీ ఈ ఆప్టికల్ ఇల్యూషన్ విషయంలో మాత్రం నక్క చాలా పాజిటివ్. నక్కను మొదట చూసిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఉద్వేగాలు కూడా అధికమే.
కోతి
కోతి చేష్టలు అని ఊరికే అనరు. అలాగే మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో మొదట కోతిని చూసినట్లయితే మీరు చాలా సరదా మనిషి అని అర్ధం.
ఏనుగు
ఏనుగును మొదట గుర్తించిన వారు తాము చేసే పనిపై చాలా శ్రద్ధను కలిగి ఉంటారు. ఇతరులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా చెప్పాలంటే మీ కంటే కూడా ఇతరులకే మీరు అధిక ప్రాధాన్యతను ఇస్తారు.
తాబేలు
ఈ చిత్రంలో తాబేలు మీకు మొదట కనిపించిందా? అయితే మీరు చాలా తెలివైనవారు. మీ ఐక్యూ కూడా అధికంగా ఉంటుంది. అలాగే సున్నిత మనస్కులు కూడా.
జిరాఫీ
పొడవాటి మెడ కలిగిన జంతువు జిరాఫీ. ఈ చిత్రంలో మీకు జిరాఫీ మొదట కనిపిస్తే మీరు ఎంతో ఓపిక కలిగిన మనుషులని అర్థం. అలాగే ఆచరణాత్మకంగా కూడా ఉంటారు.
ఎలుగుబంటి
మీకు ఎలుగుబంటి మొదట కనిపిస్తే చాలా ధైర్యవంతులని అర్థం. అలాగే మీపై ఎంతోమంది ఆధారపడి బతికే అవకాశం ఉంది. వారందరి కోసం మీరు చాలా ధైర్యంగా ఉంటారు.
Also read: డేంజరస్ వ్యాధి బైపోలార్ డిజార్డర్, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Micro Oven: మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం
Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?
Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలను ఇలా శాశ్వతంగా వదిలించుకోండి
World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్