News
News
X

Techies Height: ‘పొడవు’ కోసం పాట్లు, అందుకు లక్షలు వెచ్చిస్తున్న టెక్కీలు - ఈ కష్టాలు పగోడికి కూడా రాకూడదు!

ఎవరికైనా పొడవుగా కనిపించాలనే కోరిక ఉంటుంది. కానీ, కొందరు టెక్కీలు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు.

FOLLOW US: 

నం ఎలా పుట్టాలో ముందుగానే డిసైడ్ చేసుకునే అవకాశం లేదు. రంగు, రూపు అనేది మన చేతిలో లేని విషయం. కానీ, కొందరు తమ రంగు బాగా లేదని, రూపు బాగా లేదని బాధపడుతుంటారు. ఎలాగైనా అందంగా కనిపించాలని తాపత్రయ పడుతుంటారు. అలాంటి వారు డాక్టర్ల దగ్గర లక్షల రూపాయల ఫీజులు పోసి.. కృత్రిమ అందాలను ఒంటికి అద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరికొంత మంది ప్రాణాలు సైతం కోల్పోయిన సందర్భాలున్నాయి.

‘హైట్’ కోసం పాట్లు: ఇక అసలు విషయం ఏంటంటే.. గడిచిన కొంత కాలంగా టెక్కీలకు ఓ జబ్బు పట్టుకుందట. పొట్టిగా ఉండేవాళ్లు ఆత్మన్యూనతా భావనలో ఉండిపోతున్నారట. ఎలాగైనా పొడవు పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడటం లేదట. కొద్ది నెలలు కష్టపడితే  ‘పొట్టి’ బాధ నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారట.

అంతా పెద్ద కంపెనీల టెక్కీలే: లాస్ వేగాస్ కు చెందిన కాస్మెటిక్ సర్జన్ కెవిన్ దేబిపర్షద్ తాజాగా టెక్కీల్లో ‘ఎత్తు’ పిచ్చికి సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. నెవాడా- బేస్డ్ లింబ్‌ ప్లాస్ట్‌ఎక్స్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి అయిన ఆయన.. ప్రపంచంలోని అగ్రశ్రేని కంపెనీలకు చెందిన టెక్కీలు తమ ఎత్తును పెంచుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. లాస్ వెగాస్‌ లో ఉన్న 20 మంది సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్లు ప్రస్తుతం తన దగ్గర ఎత్తు పెరిగేందుకు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వీరిలో చాలా మంది గూగుల్, ఫేస్‌ బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.   

‘ఎత్తు’ పెరగడం సాధ్యమేనా?: వాస్తవానికి ఎత్తు పెంచే చికిత్స చేయడంలో కెవిన్ చాలా అనుభవం కలిగిన డాక్టర్. చికిత్స తర్వాత సుమారు 3 నుంచి 6 అంగుళాల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సుమారు నెల రోజుల ప్రక్రియ. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యుడు, ఎత్తు పెరగాలి అనుకునే వ్యక్తికి సంబంధించిన తొడ ఎముకను బ్రేక్ చేసి..  సర్జికల్ నెయిల్స్ ను అమర్చుతారు. ఆపరేషన్ తర్వాత, ఈ నెయిల్స్  క్రమంగా మూడు నెలల పాటు మాగ్నెటిక్ రిమోట్ కంట్రోల్‌ తో పొడిగించబడతాయి. ఎముకలు దృఢంగా మారడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఎత్తు పెరగాలి అనుకునే వ్యక్తికి ఆపరేషన్ జరిగిన తర్వాత రికవరీ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎముక  మృదువుగా, స్నాప్ అయ్యే అవకాశం ఉన్నందున రికవరీ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే  శస్త్రచికిత్స తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.    

టాప్ టెక్ కంపెనీల్లో ఉండే CEOలు,  సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు అందంగా కనిపించేందుకు, ఎత్తు పెరిగేందుకు వైద్య చికిత్సలు తీసుకుంటారు. ఎత్తు పెరిగే ఆపరేషన్ కు 70 వేల నుంచి 1 లక్షా 50  వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. అథ్లెట్ల కోసం ఈ విధానాన్ని సిఫారసు చేయరు. ఎందుకంటే ఇది వారి స్టెబులిటీని తగ్గిస్తుంది. అంతేకాదు.. వారి ఎముకలను బలహీనపరుస్తుంది.

Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది 

Also read: బతుకమ్మని పూలతోనే ఎందుకు పేరుస్తారు, తప్పనిసరిగా వినియోగించాల్సిన పూలు ఏవి!

Published at : 21 Sep 2022 04:45 PM (IST) Tags: Techies Techies Height Top Tech Companies

సంబంధిత కథనాలు

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!