అన్వేషించండి

Tomato Roti Pachadi : టమాటా రోటి పచ్చడి.. ఇంట్లో ఇలా చేసుకుంటే రెండు వారాలు నిల్వ ఉంటుంది

Tomato Chutney Recipe : టిఫిన్ తినాలన్నా.. వేడి వేడి అన్నంతో కలిసి తినాలన్నా మంచి పచ్చడి ఉండాలి. అలాంటి టేస్టీ రోటి పచ్చడిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగితే.. 

Tomato Roti Pachadi Recipe : టమాటా రోటి పచ్చడిని సరిగ్గా చేసుకోవాలే కానీ.. ఇంట్లో నాన్​వెజ్​ ఉన్నా.. దీనిని తినాలనే మీ మనసు లాగుతుంది. అలాంటి రెసిపీనే ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాము. దీనిని మీరు ఉదయాన్నే అల్పాహారంలో చట్నీగా.. మధ్యాహ్నం భోజనంలో మంచి కాంబినేషన్​గా తీసుకోవచ్చు. పైగా ఈ రోటి పచ్చడిని రెండు వారాలు నిల్వ కూడా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ టమాటా రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఈ రెసిపీని తయారు చేస్తున్న సమయంలో ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

టమాటాలు - అరకిలో

ఎండు మిర్చి - 20 

కరివేపాకు - 3 రెబ్బలు

నూనె - 4 చెంచాలు

మెంతులు - అర చెంచా

ఉప్పు - తగినంత

పసుపు - అర చెంచా

చింత పండు - నిమ్మకాయ అంత 

వెల్లుల్లి - 30 రెబ్బలు

జీలకర్ర - చెంచా

తాళింపు కోసం

నూనె - 2 స్పూన్లు

పోపు గింజలు - 2 చెంచాలు

వెల్లులి - 10

ఎండు మిర్చి - 3

కరివేపాకు - 2 రెబ్బలు

తయారీ విధానం

ముందుగా వెల్లుల్లిని పొట్టు తీసుకోవాలి. ఎండుమిర్చిని మీడియం సైజ్​లో కట్ చేసి పక్క పెట్టుకోవాలి. టమాటాలను బాగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడ స్టౌవ్ వెలిగించి ఓ కడాయి పెట్టి దానిలో చెంచా నూనె వేయాలి. దానిలో ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి. వాటిని స్టౌవ్ మీద నుంచి తీసి.. మరో ప్లేట్​లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మెంతులు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వాటిని వేసిన వెంటనే టమాటాలు కూడా వేసుకోవాలి. 

టమాటాలు వేగుతున్న సమయంలో పసుపు.. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిపై మూత వేసి మగ్గనివ్వాలి. అయితే చాలామంది ఎండుమిర్చిని దీనిలోనే ఎందుకు కలిపి వేయకూడదు అనుకుంటారు. మీరు కూడా అలాంటి వారు అయితే.. దానికి ఆన్సర్ ఇదే. ఎండుమిర్చిని టమాటాలతో కలిపి ఉంచితే.. దంచినప్పుడు లేదా మిక్సీ చేసినప్పుడు అది పూర్తిగా పొడిగా కాదు. మెత్తగా మారిపోయి.. పచ్చడిలో కలవదు. కానీ ముందు వేయించుకుని పక్కన పెట్టుకోవడం వల్ల అవి డ్రైగా మారి.. దంచినప్పుడు త్వరగా పొడిగా మారతాయి. మిక్సీలో వేసినా కూడా కరకరలాడుతూ త్వరగా పొడి అవుతాయి. అయితే మీరు ఎప్పుడూ ఎండుమిర్చిని కలిపి గ్రైండ్ చేయకూడదు. వాటిని విడిగా డ్రై చేసిన తర్వాతనే మిగిలిన మిశ్రమం వేసుకోవాలి. పచ్చిమిర్చితో ఇలాంటి ఇబ్బంది ఉండదు. నేరుగా మిర్చితో కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. 

టమాటాలు మగ్గిపోతే.. దానిలో చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మూడు నిమిషాలు వేయించుకుని స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు రోలు లేదా మిక్సీని తీసుకుని.. దానిలో ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. ఎండుమిర్చిని దంచే సమయంలో కాస్త ఉప్పు వేస్తే త్వరగా పొడి అవుతాయి. ఇలా పొడి అయిన తర్వాత టమాటా మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని.. మరికొంత వేసుకుని.. దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకోవాలి.

స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి దానిలో నూనె వేసి.. పోపు గింజలు వేయాలి. అవి వేగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని.. వాటిని టమాటా పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ టమాటా రోటి పచ్చడి రెడీ. దీనిని మీరు మీకు నచ్చిన టిఫెన్లలో కలిపి తినొచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దాని రుచిని వర్ణించడం కష్టమే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టమాటా రోటి పచ్చడిని మీరు తయారు చేసేసుకోండి.  

Also Read : టేస్టీ, క్రిస్పీ పునుగుల రెసిపీ.. సగ్గుబియ్యంతో ఇలా చేస్తే రుచిగా ఉంటాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget